నేర్చుకోవడం

(నేర్చుకోవడము నుండి దారిమార్పు చెందింది)

నేర్చుకోవడం అనేది అధ్యయనం, అనుభవం, సూచనల ద్వారా కొత్త జ్ఞానం, నైపుణ్యాలు, ప్రవర్తనలు, విలువలను పొందే ప్రక్రియ. ఇది మానవాభివృద్ధికి ఒక ప్రాథమిక అంశం. ఇది వ్యక్తిగత ఎదుగుదలకు, వృత్తిపరమైన పురోగతికి, సామాజిక పురోగతికి కీలకమైనది. అధికారికంగా విద్యను అభ్యసించడం, శిక్షణ తీసుకోవడం, అనధికారికంగా శిక్షణ పొందడం, ఆచరణాత్మక అనుభవం, పరిశీలన, ప్రయోగాలు వంటి వివిధ మార్గాల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. నేర్చుకోవడాన్ని ఆంగ్లంలో లెర్నింగ్ అంటారు. విద్యార్థులు తమ విద్యను విద్యాలయములలో, కళాశాలలో నేర్చుకుంటారు. వృత్తి పరమైన విద్యలను కొందరు తమ తల్లిదండ్రుల నుంచి ఇతర శిక్షణా తరగతుల నుంచి నేర్చుకుంటారు. నేర్చుకోవడంలో అనేక రకాలున్నాయి.[1]

నేర్చుకోవడం యొక్క వివిధ రకాలు:

  1. అభిజ్ఞాత్మక లెర్నింగ్ లేదా తలంపు ద్వారా నేర్చుకోవడం: చదవడం, వినడం లేదా చూడటం ద్వారా జ్ఞానం, అవగాహనను పెంపొందించుకోవడం.
  2. బిహేవియరల్ లెర్నింగ్ లేదా ప్రవర్తన ద్వారా నేర్చుకోవడం లేదా నడవడిక ద్వారా నేర్చుకోవడం: పునరావృతం, ప్రతిపుష్టి, మద్దతు ద్వారా నైపుణ్యాలను నేర్చుకోవడం.
  3. అనుభవపూర్వకంగా నేర్చుకోవడం: స్వంతంగా ప్రయత్నించడం ద్వారా ఎదురైన సమస్యలను ఎదుర్కొంటూ, సమస్యలకు పరిష్కారాలను స్వంతంగా కనుక్కొంటూ నేర్చుకోవడాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకోవడం అంటారు.
  4. సామాజిక లెర్నింగ్: మిత్రులు, సహచరులు, మార్గదర్శకులు వంటి ఇతరుల నుండి నేర్చుకోవడాన్ని సామాజిక లెర్నింగ్ అంటారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Hilgard E.H. & Bower G.D. 1981. Theories of learning. 5th ed, Appleton-Century-Crofts, New York.