నేల గుమ్మడి

చిక్కడు జాతి చెట్టు

నేల గుమ్మడి అడవిలో దొరికే ఒక ఔషధ మొక్క. ఫాబేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం ప్యురేరియా ట్యూబరోసా (Pueraria Tuberosa), సంస్కృతలో ఈ మొక్కను విదారి కంద, స్వాధు కంద, ఇసుగంధ, భూమి కూష్మాంఢ అనే పేర్లతో పిలుస్తారు. ఆంగ్ల పరిభాషలో ఈ మొక్కను ఇండియన్ కుడ్జు అని అంటారు. కొన్ని గిరిజన గ్రామాల్లో నేలగుమ్మడిని దారి గుమ్మడి అని కూడా అంటారు. హిందీలో బిలై కంద అని, కన్నడలో నేల గుంభాల అని, మలయాళంలో ముతక్కు అని, తమిళంలో నిలా పూసాని అని పిలుస్తారు.

Pueraria tuberosa
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
P. tuberosa
Binomial name
Pueraria tuberosa
Synonyms[1]
  • Hedysarum tuberosum Willd.

ఉనికి

మార్చు

ఈ మొక్క భారత దేశంలో ఉన్న తూర్పు కనుమలు, పడమటి కనుమలు, ఈశాన్య రాష్ట్రాల అడవుల్లోను, నేపాల్, పాకిస్థాన్ దేశాల్లోను కనిపిస్తుంది.

పెరుగుదల

మార్చు

ఇది తీగమొక్కలా పెరుగుతుంది.

ప్రధానంగా ఉపయోగపడే భాగం

మార్చు

నేలగుమ్మడి మొక్కలో ప్రధానంగా ఉపయోగించే నేలగుమ్మడి అనే భాగం దుంప రూపం. ఇది గుమ్మడి కాయలా వుండటంతో నేలలో పెరిగే గుమ్మడి అనుకుని దానికాపేరు పెట్టి వుంటారు.

నేలగుమ్మడి కాయ రుచి తియ్యగా వుంటుంది.

రసాయన సమ్మేళనాలు

మార్చు
  1. Hydroxytuberosone,
  2. Anhydrotuberosin,
  3. 3 - O-methylanhydrotuberosine,
  4. Tuberostan,
  5. Puerarostan,
  6. Puerarone,
  7. Tuberosin,
  8. B-sitosterol,
  9. Stigmasterol

తీసుకునే విధానం

మార్చు

నేలగుమ్మడిని పొడిగా, లేహ్యంగా, రసంగా, కషాయంగా, చ్యవనప్రాశ్ గానూ తయారుచేసుకుని వాడతారు.

ఉపయోగాలు

మార్చు
  • ఇది పిత్తదోహాలను హరించి కఫన్ని పెంచే ప్రధాన లక్షణాన్ని కలిగివుంటుంది.
  • గిరిజనులు ఈ మొక్క నుండి లభించే రసాన్ని చర్మ వ్యాధులకి, లైంగిక పటుత్వానికి వాడతారు.
  • ఒడిషా మయూర్ భంజ్ జిల్లాలో గిరిజనులు కీళ్ళ నొప్పులకి నేలగుమ్మడి వేరును ముద్దగా చేసి ఒంటికి వ్రాసుకుంటారు.[2]
  • ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో గిరిజనులు గుండె నొప్పి వచ్చే సమయంలో విదారికంద వేరుని పొడిలో పంచదార కలిపి మాత్రలుగా చేసి, రోజులు 2 సార్లు చొప్పున 4 లేక 5 రోజులు సేవిస్తారు.

నిస్సత్తువ నుండి ఉపశమనం పొందడానికి ఉడికించిన విదారికంద వేళ్లను రోజుకు 2 సార్లు చొప్పున 3 వారాలు తింటారు.[3]

  • రక్తి శుద్ధి కోసం దీనిని ఉపయోగిస్తారు
  • స్తన్యవృద్ది కోసం ఇది పనిచేస్తుంది.

అంతరించే దశలో అరుదైన మొక్క

మార్చు

అక్రమ చొరబాటుదారుల వల్ల ప్రస్తుతానికి ఈ నేలగుమ్మడి జాతి అంతరించిపోయే దశలో ఉంది.

మూలాలు

మార్చు
  1. "The Plant List: A Working List of All Plant Species". Archived from the original on 2022-06-08. Retrieved 2015-08-06.
  2. Ethno-medicinal Plants Used to Cure Different Diseases by Tribals of Mayurbhanj District of North Orissa by S.D. Rout, T. Panda and N. Mishra
  3. Some ethnomedical plants of family - Fabaceae of Chattisgarh state - by Amia Tirkey

లంకెలు

మార్చు