నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్

యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ప్రభుత్వంచే నిర్వహించబడుచున్న ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య లైబ్రరీ.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (ఎన్ఎల్ఎం) (The United States National Library of Medicine (NLM), బయోమెడికల్ ఇన్ఫర్మేటిక్స్, డేటా సైన్స్ పరిశోధనలో పరిశోధకులకు సమాచారం ఇస్తున్న సమాచార నిలయం. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెడికల్ లైబ్రరీ. ఈ లైబరీ ఆరోగ్య సమాచారాన్ని రికార్డ్ చేయడం, నిల్వ చేయడం, తిరిగి పొందడం, భద్రపరచడంఇవ్వడం వివిధ పద్ధతుల్లో పరిశోధనను నిర్వహిస్తుంది, కావలసిన పాఠకునికి సమాచారం అందచేస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) లో ఈ లైబ్రరీ ఒక భాగంగా ఉన్నది [1].

1999 లో నేషనల్ లైబ్రరీ ఆప్ మెడిసన్
  • నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెడికల్ లైబ్రరీ.
  • సమాచార సేవలు శాస్త్రీయ ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణ ప్రజారోగ్యానికి మద్దతునిస్తాయి.
  • బయోమెడికల్ డేటా సమాచారాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఎన్ఎల్ఎం కొత్త మార్గాలను రూపొందించింది.
  • మెరుగైన డేటా నిర్వహణ, వ్యక్తిగత ఆరోగ్యం కోసం సాధనాలను రూపొందిస్తుంది.
  • వైవిధ్య మైన డేటా నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ ను రూపొందించడంలో సహాయపడుతుంది.
  • ఎన్ఎల్ఎం పరిశోధకులు, వైద్యులు, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బయోమెడికల్ డేటా విస్తారమైన సంపదను ఉపయోగించుకునేలా చేస్తుంది.

చరిత్ర మార్చు

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ 1836 లో ఆర్మీ సర్జన్ జనరల్ కార్యాలయం గంథాలయం (లైబ్రరీ)గా ప్రారంభమైంది. ఆర్మ్ డ్ ఫోర్సెస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ, దాని మెడికల్ మ్యూజియం 1862 లో ఆర్మీ మెడికల్ మ్యూజియంగా ప్రారంభమయ్యాయి. అబ్రహం లింకన్ హత్యానంతరం వీరు 1866 నుండి 1887 వరకు ఫోర్డ్ థియేటర్ లో ఉన్నది.

1956 సంవత్సరంలో, గ్రంథాలయ సేకరణ రక్షణ శాఖ నియంత్రణ నుండి ఆరోగ్య, విద్య, సంక్షేమ శాఖ  ప్రజారోగ్య సేవకు బదిలీ చేయబడి, తర్వాత  నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ గా పేరు మార్చబడింది. లైబ్రరీ 1962 లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రాంగణంలోని మేరీల్యాండ్ లోని బెథెస్డాలోని ప్రస్తుత  భవనంలోకి  మారింది. 19 వ శతాబ్దంలో మూలాలతో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) వైద్య పరిశోధనలో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. 27 ప్రత్యేక సంస్థలను, కేంద్రాలను కలిగి ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) వైద్య పరిశోధనలను నిర్వహించడానికి, వైద్య రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రాధమిక సమాఖ్య సంస్థ గా ఉన్నది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి శాస్త్రవేత్తలకు నాయకత్వం, ఆర్థిక మద్దతును అందచేస్తుంది[2].

అవలోకనం మార్చు

ప్రపంచంలోని అతిపెద్ద బయోమెడికల్ లైబ్రరీ గా  ఉన్న  నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (ఎన్ఎల్ఎమ్), వైద్యాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆరోగ్య నిపుణులు, విద్యార్థులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు, మెడికల్ లైబ్రేరియన్లు, ఉపయోగించే విశ్వసనీయ ఆరోగ్య సమాచారాన్ని అందచేస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) , ఇతర ఫెడరల్ ఏజెన్సీల భాగస్వామ్యంతో, బయోమెడికల్ పరిశోధనను ఆచరణలోకి అనువదించే పనిలో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్(ఎన్ఎల్ఎం) లో ఉన్న కీలక లింక్, పరిశోధన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్య రంగానికి అక్కడ ఉన్న  వనరులు ప్రజలకు, సంరక్షణ ప్రదాతలకు ,పరిశోధకులకు సేవలు అందిస్తాయి, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ డేటాబేస్ లోదాదాపు 300 డేటాబేస్ లు,అంతర్జాలం లో ( ఆన్ లైన్)సేవలను లైబ్రరీల ద్వారా, ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ఎవరికైనా ఉచితంగా అందుబాటులో పెట్టడం జరుగుతుంది. ఈ వనరులు ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, వ్యాధి నివారణ ,బయోమెడికల్ పరిశోధనలకు,  ఆవిష్కరణలకు మద్దతు ఇస్తాయి[3].

సందర్శకులు మార్చు

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వనరులు ప్రతి రోజు 1 మిలియన్ చూస్తారు . పరిశోధకులకు అందరికి ఆరోగ్య సమాచారం ఆంగ్లము ,స్పానిష్ భాషలలో 1,000 ఆరోగ్య అంశాలు ఉంటాయి. ఈ గ్రంథాలయం లో ఉన్న జర్నల్స్ లో PubMedGov-W300.png ఈ వనరులలో 27 మిలియన్ల జర్నల్ ప్రచురణలు ఉన్నాయి. మెడ్ లైన్, లైఫ్ సైన్స్ జర్నల్స్ ,ఉచిత పుస్తకాల( ఆన్ లైన్) నుండి ఉల్లేఖనాలను ప్రతిరోజూ 2.4 మిలియన్ల మంది వినియోగదారులు శోధించారు. పబ్మెడ్ సెంట్రల్లో 4.2 మిలియన్ ఉచిత వ్యాసాలకు రోజుకు 1.4 మిలియన్ల మంది వినియోగదారులు 2.8 మిలియన్లకు పైగా వ్యాసాలను డౌన్లోడ్ చేస్తున్నారు, కాంగ్రెస్ తప్పనిసరి చేసిన ఎన్ఐహెచ్ పబ్లిక్ యాక్సెస్ పాలసీ సంవత్సరానికి 100,000 వ్యాసాలను జోడిస్తుంది. ఇవిగాక 10 ఇతర ఫెడరల్ ఏజెన్సీల పబ్లిక్ యాక్సెస్ విధానాలకు మద్దతు ఇస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ఉన్న వనరులకు ఉచితంగా అందుబాటులో ఉంచి వైద్య పరిశోధనలు చేసే వారికి ఉపయోగ పడే సమాచారం అందిస్తున్నది చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు[3].

మూలాలు మార్చు

  1. "National Library of Medicine | USAGov". www.usa.gov (in ఇంగ్లీష్). Retrieved 2023-03-25.
  2. "About The National Library of Medicine". Friends of the National Library of Medicine (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-03-25.
  3. 3.0 3.1 "MLA : TAKE ACTION : The National Library of Medicine: an Investment in Good Health". www.mlanet.org. Retrieved 2023-03-25.