శివాజీ (నటుడు)

సినీ నటుడు, రాజకీయ కార్యకర్త

శివాజీ తెలుగు సినిమా రంగానికి చెందిన ఒక నటుడు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా, గొరిజవోలు అనే ఒక కుగ్రామం. మొదట బుల్లితెరపై వ్యాఖ్యాత గా పనిచేశాడు. తరువాత చిన్న పాత్రల ద్వారా పరిశ్రమ లోకి వచ్చిన శివాజీ తరువాత హీరోగా నిలదొక్కుకున్నాడు. మొదట్లో ఏదైనా చిన్న ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిద్దామని హైదరాబాద్ కి వచ్చాడు. అప్పుడే కొత్తగా ప్రారంభమైన జెమినీ టీవీలో వీడియో ఎడిటర్ గా చేరాడు. కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య అక్కడే యాంకర్ గా మారాడు.

శివాజీ
జననం1977 జూన్ 30
వృత్తివ్యాఖ్యాత, నటుడు, రాజకీయ కార్యకర్త

కె. రాఘవేంద్ర రావు 2000 సంవత్సరంలో తను చేయబోయే కొత్త సినిమా పరదేశి అనే సినిమా కోసం నూతన నటీనటుల కోసం స్టార్ 2000 కాంటెస్ట్ అనే ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో లయ, శివాజీ రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో నిలిచిన వారు పరదేశి సినిమాలో కనిపించిన తరువాత మరే సినిమాలలోనూ కనిపించలేదు. కానీ ఆ షో వల్ల శివాజీ గురించి పదిమందికి తెలిసింది. దాంతో నెమ్మదిగా సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.

డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు దగ్గర ఎడిట్ సూట్ లో పనిచేశాడు. అప్పుడే సినిమాలని నిశితంగా పరిశీలించడం నేర్చుకున్నాడు. శివాజీ నటించిన సినిమాల్లో మొదట విడుదలైంది. చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ అనే సినిమా.[1] కానీ తొలి అవకాశం ఇచ్చింది మాత్రం వై. వి. ఎస్. చౌదరి. ఆ సినిమా సీతారాముల కళ్యాణం చూతము రారండీ అందులో శివాజీది హీరో స్నేహితుడి పాత్ర. ఆ సినిమా కోసం ఆయన మొట్టమొదటి సారిగా విమానమెక్కి విదేశం (దుబాయ్) వెళ్ళాడు.

స్వతహాగా చిరంజీవి అభిమానియైన శివాజీ ఆయన్ను కలవాలని ఆశగా ఉండేది. ఆ కోరిక మాస్టర్ సినిమాతో తీరింది. ఈ సినిమాలో శివాజీ ప్రతిభావంతుడైన క్రీడాకారుడిగా కనిపిస్తాడు. కనీసం బూట్లు కూడా కొనుక్కోలేని పేదరికంలో ఉంటే చిరంజీవి అతన్ని ప్రోత్సహిస్తాడు. నిజజీవితంలో కూడా చిరంజీవి లాంటి పెద్ద మనసున్న వాళ్ళు తనను అలాగే ప్రోత్సహించారని వినమ్రంగా చెబుతాడు శివాజీ. హీరో అవ్వాలనే సినిమా రంగంలోకి రాలేదనీ వైవిధ్యభరితమైన ఏ పాత్ర రూపంలో అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి సిద్దంగా ఉన్నానని చెబుతాడు. సినిమాల్లో ఆయన తొలి సంపాదన పదిహేను వేల రూపాయలు. మాస్టర్ సినిమాకు పనిచేస్తే వచ్చిన డబ్బులవి. అందరు మధ్య తరగతి కుర్రాళ్ళలానే ఆయన ఆ డబ్బుతో వాళ్ళ అమ్మకు బంగారం కొన్నాడు.

రాజకీయాల్లో సవరించు

భారతీయ జనతా పార్టీలో చేరడంతో శివాజీ రాజకీయాల్లో ప్రవేశించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత, రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధించేందుకు కృషి చేసాడు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితిలో చేరి ఉద్యమించాడు. హోదా ఇవ్వనందుకు తన స్వంత పార్టీ భాజపాను విమర్శించాడు. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా 2015 మే 3 న గుంటూరులో 48 గంటల నిరాహారదీక్ష చేసాడు.[2] తదనంతర కాలంలో పార్టీకి రాజీనామా చేసాడు.

2018 మార్చి 22న చేసిన ఒక పత్రికా ప్రకటనలో, ఒక జాతీయ రాజకీయ పార్టీ దక్షిణ భారతదేశంలో విస్తరించేందుకు గాను, "ఆపరేషన్ ద్రవిడ" అనే కార్యక్రమం చేపట్టిందని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో "ఆపరేషన్ గరుడ"ను నిర్వహిస్తోందనీ చెప్పాడు.[3][4]


శివాజీ నటించిన కొన్ని చిత్రాలు సవరించు

మూలాలు సవరించు

  1. మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక లో ప్రచురితమైన శివాజీ ఇంటర్వ్యూ ఆధారంగా
  2. "Sivaji on hunger strike for Andhra Pradesh's special status". 14 May 2015. Archived from the original on 8 మే 2015. Retrieved 10 ఏప్రిల్ 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "సంచలన విషయాలు బయట పెట్టిన శివాజీ." 22 March 2018. Archived from the original on 22 మార్చి 2018. Retrieved 10 ఏప్రిల్ 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "శివాజీ చెప్పిన సినిమా స్టోరీ". 23 March 2018. Archived from the original on 10 ఏప్రిల్ 2018. Retrieved 10 ఏప్రిల్ 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. తెలుగు గ్రేట్ ఆంధ్ర, రివ్యూ (5 September 2014). "సినిమా రివ్యూ: బూచమ్మ బూచోడు". www.telugu.greatandhra.com. Retrieved 7 August 2020.
  6. "Pavitra to hit screens on May 10". Deccan Chronicle. 10 May 2013. Archived from the original on 14 అక్టోబరు 2016. Retrieved 28 జూలై 2019.