Nylon Nylon 6,6 Nylon 6,6 unit
Density 1.15 g/cm3
Electrical conductivity (σ) 10−12 S/m
Thermal conductivity 0.25 W/(m·K)
Melting point 463–624 K
190–350 °C
374–663 °F

నైలాన్ కృత్రిమ అణుపుంజాలకు (synthetic polymers) చెందిన కుటుంబం. నైలాన్లు తెలుపు రంగువి, లేదా రంగు లేనివి,[1][2] ఇంకా మృదువైనవి. కొన్ని పట్టు (సిల్క్) లాగా ఉంటాయి.[3] ఇవి థర్మోప్లాస్టిక్లు, అంటే వీటిని వేడి చేసి కరిగించి పోగులుగా, సన్నని పొరలుగా, వేర్వేరు ఆకృతుల్లోకి మార్చవచ్చు.[4][5] అనేక రకాల సంకలితాలతో కలపడం ద్వారా నైలాన్ల లక్షణాలు మార్చవచ్చు. డ్యుపాంట్ అనే సంస్థ పాలిమర్లపై జరిపిన పరిశోధనల్లో భాగంగా నైలాన్ ఆవిష్కరించబడింది.

నైలాన్లలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ఒక కుటుంబం నైలాన్-XY. దీనిని డైఅమైన్లు, X, Y పొడవు కలిగిన కర్బన శృంఖలాలతో ఏర్పడ్డ డైకార్బాక్సిలిక్ ఆమ్లం నుండి ఉత్పత్తి చేస్తారు. దీనికి ముఖ్యమైన ఉదాహరణ నైలాన్-6,6. ఇంకో కుటుంబం నైలాన్-Z. దీనిని Z పొడవు కర్బన శృంఖలాలు కలిగిన అమైనోకార్బాక్సిలిక్ ఆమ్లం నుంచి తయారు చేస్తారు. దీనికి ఉదాహరణ నైలాన్-6.

నైలాన్ పాలిమర్‌లను దుస్తులు, తివాచీల్లో వాడే పోగులు, వివిధ ఆకారాల్లో అచ్చుపోసిన కార్ల విడిభాగాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, ఆహారం ప్యాకేజింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.[6]

మూలాలు

మార్చు
  1. Clark, Jim. "Polyamides". Chemguide. Retrieved 27 January 2015.
  2. "Nylon". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-12-30.
  3. Lew, Darrin (2021-04-19). "Theoretical Comparison Between Nylon and Silk - Global Warming". Dr. Darrin Lew (in ఇంగ్లీష్). Retrieved 2021-06-24.
  4. Vogler, H. (2013). "Wettstreit um die Polyamidfasern". Chemie in unserer Zeit. 47: 62–63. doi:10.1002/ciuz.201390006.
  5. Kohan, Melvin (1995). Nylon Plastics Handbook. Munich: Carl Hanser Verlag. ISBN 1569901899.
  6. "Nylons (Polyamide)". British Plastics Federation. Retrieved 19 June 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=నైలాన్&oldid=4143059" నుండి వెలికితీశారు