నైవేలి సంతానగోపాలన్

నైవేలి సంతానగోపాలన్ (జననం 1963) ఒక భారతీయ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు.[2]

నైవేలి సంతానగోపాలన్
Neyveli Santhanagopalan.jpg
వ్యక్తిగత సమాచారం
జననం (1963-06-06) 6 June 1963 (age 59)[1]
తిరుచిరాపల్లి, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తికర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు

విశేషాలుసవరించు

ఇతడు 1963,జూన్ 6వ తేదీన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించాడు. ఇతడు చెంబై అనంతమణి భాగవతార్[3], సి.ఎస్.ఆనందన్, ఆర్.రంగనాథన్, తంజావూరు శంకర అయ్యర్, మహారాజపురం సంతానం, టి.ఎన్.శేషగోపాలన్‌ల వద్ద సంగీతం నేర్చుకున్నాడు.[4][5] ఇతడు స్వదేశంలోను, విదేశాలలోను ముఖ్యమైన సంగీతోత్సవాలలో పాల్గొని కర్ణాటక గాత్ర విద్వాంసునిగా గుర్తింపు పొందాడు. ఇతడు సంగీతం గురించి అనేక ప్రసంగాలను చేశాడు. అనేక సంస్థలలో ఇతడు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు నైవేలి శిష్యకులం అనే సంస్థను స్థాపించాడు. రాగాస్ త్రూ పల్లవి, పంచరత్న కృతులు, డివైన్ మూడ్స్ వంటి అనేక రికార్డులను వెలువరించాడు.ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఎ గ్రేడు కళాకారుడిగా అనేక కార్యక్రమాలు చేశాడు. ఇతడు తమిళ టి.వి.ఛానల్ జయ టివిలో "సరిగమప" అనే కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించాడు.[6] ఇతనికి గాత్ర సంగీతంతో పాటు వీణ మొదలైన వాద్యాలలో ప్రావీణ్యం ఉంది. ఇతడు సునామీ వంటి విపరీత పరిస్థితులలో బాధితులను ఆదుకోవడానికి సంగీత ప్రదర్శనలు చేసి వచ్చిన ధనాన్ని సేవాసంస్థలకు వితరణ చేశాడు.

అవార్డులుసవరించు

ఇతనికి అనేక పురస్కారాలు, బిరుదులు లభించాయి. వాటిలో కొన్ని:

 • శ్రీ త్యాగబ్రహ్మ గాన సభ వారిచే "వాణీ కళాసుధాకర"
 • 2008లో తపస్ కల్చరల్ ఫౌండేషన్ వారిచే "విద్యా తపస్వి" పురస్కారం.
 • 2014లో సంగీత నాటక అకాడమీ అవార్డు.[7]
 • 2008లో పార్థసారథి స్వామి సభ వారిచే "సంగీత కళాసారథి" బిరుదు.
 • 2011లో సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వారిచే "సంగీత చక్రవర్తి" బిరుదు.
 • 2015లో శ్రీకృష్ణ గానసభ వారిచే "సంగీత చూడామణి" బిరుదు.
 • 2015లో క్లీవ్ లాండ్ త్యాగరాయ ఆరాధనోత్సవాలలో "ఆచార్య రత్నాకర" బిరుదు.

ఇవే కాక భారత్ కళాచార్, కార్తీక్ ఫైన్‌ఆర్ట్స్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్ ఫౌండేషన్ వంటి పలు సంస్థలు ఇతడిని సన్మానించాయి.

మూలాలుసవరించు

 1. "Neyveli Santhanagopalan". Sangeet Natak Akademi. Archived from the original on 13 డిసెంబర్ 2019. Retrieved 28 February 2022. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 2. "Songs with sparkle". The Hindu. 18 May 2007. Archived from the original on 14 జనవరి 2012. Retrieved 21 October 2013.
 3. Venkatesan Srikanth (8 November 2012). "The Providence fund". The Hindu. Retrieved 28 February 2021.
 4. "Profile". neyvelisanthanagopalan.net. Archived from the original on 2018-05-30. Retrieved 2018-08-20.
 5. Ramnarayan, V. (2012-12-13). "The resonant guru-shishya symphony". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2018-08-20.
 6. Warrier, Shobha (18 October 2007). "Now, a Carnatic Idol! - Rediff.com movies". Rediff.com. Retrieved 21 October 2013.
 7. "Declaration of Sangeet Natak Akademi Fellowships (Akademi Ratna) and Akademi Awards (Akademi Puraskar) for the Year 2014" (PDF). sangeetnatak.gov.in. Archived from the original (PDF) on 14 జూన్ 2015. Retrieved 28 ఫిబ్రవరి 2021.

బయటి లింకులుసవరించు