మహారాజపురం సంతానం
మహారాజపురం సంతానం, (20 మే 1928[1]-24 జూన్ 1992[2]) 20వ శతాబ్దపు కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసులలో ఎన్నదగినవాడు.
మహారాజపురం సంతానం | |
---|---|
జననం | మహారాజపురం విశ్వనాథ సంతానం 1928 మే 20 సిరునంగూర్, తమిళనాడు |
మరణం | 1992 జూన్ 24 | (వయసు 64)
వృత్తి | కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు |
విశేషాలు
మార్చుఇతడు 1928,మే 20వ తేదీన తమిళనాడు రాష్ట్రం సిరునంగూర్ గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి మహారాజపురం విశ్వనాథ అయ్యర్ కూడా సంగీత విద్వాంసుడే. ఇతడు తన తండ్రి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. తరువాత మేలత్తూరు శ్యామ దీక్షితార్ వద్ద మరింత క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఇతడు మంచి స్వరకర్త కూడా. మురుగన్ పై, కంచి శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిపై అనేక పాటలు వ్రాశాడు. ఇతడు శ్రీలంకలోని రామనాథన్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. [3] తర్వాత ఇతడు చెన్నైలో స్థిరపడ్డాడు. ఇతడు పాడిన పాటలలో రేవతి రాగంలో "భో శంభో శివ శంభో స్వయంభో", బాగేశ్రీ రాగంలో "మధుర మధుర మీనాక్షి మధురాపురి నిలయే", మేచకళ్యాణి రాగంలో "ఉన్నైయల్లాల్ వేరే గతి ఎనక్కుందో" , షణ్ముఖప్రియ రాగంలో "సదా నీ పాదమే గతి, షణ్ముఖప్రియ రాగంలోవరం ఒన్రు తందరుళ్వాఇ వడివేలా" , రాగమాలిక రాగంలో "శ్రీచక్రరాజ సింహాసనేశ్వరీ", రాగమాలిక రాగంలో"నళిన కాంతి మతిం" రాగమాలిక రాగంలో"క్షీరాబ్ది కన్యకె", శుద్ధ ధన్యాశి రాగంలో "నారాయణ నిన్న నామద స్మరణెయ", "గోవిందా నిన్న నామవె చంద" మొదలైనవి ప్రజాదరణ పొందాయి. ఇతని కీర్తనలలో భక్తి రసం ఎక్కువగా ఉంటుంది.
ఇతడు 1992, జూన్ 24న చెన్నైలో ఒక కారు ప్రమాదంలో మరణించాడు. ఇతని కుమారులు మహారాజపురం ఎస్.శ్రీనివాసన్, మహారాజపురం ఎస్. రామచంద్రన్, ఇతని శిష్యుడు ఆర్.గణేష్ ఇతని సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఇతని జ్ఞాపకార్థం చెన్నై టి.నగర్‌లోని ఒక వీధికి "మహారాజపురం సంతానం సాలై" అని పేరుపెట్టారు.
పురస్కారాలు, బిరుదులు
మార్చు- 1990లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం [4]
- 1989లో మద్రాసు సంగీత అకాడమీ వారి సంగీత కళానిధి
- 1984లో సంగీత నాటక అకాడమీ అవార్డు
- కళైమామణి
- ఋషీకేశ్‌లోని యోగ వేదాంత విశ్వవిద్యాలయ్ం వారిచే "సంగీత సుధాకర"
- శృంగేరీ శారదా పీఠం వారిచే "గాన కళానిధి"
- కంచి కామకోటి పీఠం వారిచే "సంగీతసాగరామృతవర్షి"
- తిరుమల తిరుపతి దేవస్థానం, కంచి కామకోటి పీఠం, పిట్స్‌బర్గ్ వెంకటేశ్వరస్వామి దేవస్థానం, గణపతి సచ్చిదానంద ఆశ్రమాలకు ఆస్థాన విద్వాంసుడు.
మూలాలు
మార్చు- ↑ Shri Maharajapuram Santhanam concert day
- ↑ Interview with student Ganesh
- ↑ Ludwig Pesch, The Illustrated Companion to South Indian Classical Music (New Delhi: Oxford University Press, 1999), p. 238.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 21 July 2015.
- 4. ^ Maharajapuram Santhanam A Life of Music Archived 2019-05-15 at the Wayback Machine