కొత్త ఢిల్లీ జిల్లా
న్యూ ఢిల్లీ జిల్లా, భారతదేశం, ఢిల్లీ రాష్ట్రం లోని పరిపాలనా జిల్లా. [1] దీని జిల్లా ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇది భారతదేశ రాజధాని. దాని సరిహద్దులలో ఉన్న న్యూఢిల్లీ పేరు దీనికి పెట్టబడింది. ఇది పూర్తిగా ఢిల్లీ మహానగరంలో ఒక భాగం. ఈ జిల్లా 1997లో స్థాపించబడింది.[2] [3] అయితే 2012లో ఢిల్లీ జిల్లాలను పునర్నిర్మించే సమయంలో దీని సరిహద్దులు గణనీయంగా మారాయి [4]
New Delhi district | |
---|---|
Coordinates: 28°36′50″N 77°12′32″E / 28.6140°N 77.2089°E | |
Country | India |
Union Territory | Delhi |
Headquarters | New Delhi |
Languages | |
• Official | Hindi, English |
Time zone | UTC+5:30 (IST) |
Nearest city | New Delhi |
భౌగోళిక శాస్త్రం
మార్చున్యూఢిల్లీ జిల్లా ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్.సి.టి)లోని మూడు పురపాలక సంఘాలు, [5] అవి న్యూఢిల్లీ, ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ నగరపాలక సంస్థ ప్రాంతాలతో విస్తరించి ఉంది.ఇది కేంద్రంగా ఉన్న లుటియన్స్ ఢిల్లీని కవర్ చేస్తుంది. ఎన్.సి.టి. నైరుతి సరిహద్దు గురుగ్రామ్ వరకు విస్తరించి ఉంది. [6] ఎన్.సి.టి.లోని ఇతర 10 జిల్లాలలో మాదిరిగానే పరిపాలనా సౌలభ్యం కోసం, చాణక్యపురి, ఢిల్లీ కంటోన్మెంట్, వసంత్ విహార్ అనే మూడు తహసీల్‌లుగా విభజించారు.. [7]
చరిత్ర
మార్చున్యూ ఢిల్లీ జిల్లా 1997లో స్థాపించబడింది, ఎన్.సి.టి. పూర్వపు ఒకే జిల్లా 9 జిల్లాలుగా విభజించబడింది.[8] అప్పటి సరిహద్దులలో, జిల్లా 35 కిమీ² విస్తరించి ఉంది.[9] 2012లో ఢిల్లీ జిల్లాల సరిహద్దులను పునర్నిర్మించినప్పుడు, న్యూ ఢిల్లీ జిల్లా విస్తీర్ణం గణనీయంగా పెద్దదిగా మారింది.[10] ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన హర్యానా సరిహద్దు వరకు విస్తరించింది.[11]
గణాంకాలు
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1961 | 1,43,846 | — |
1971 | 1,64,702 | +14.5% |
1981 | 1,44,115 | −12.5% |
1991 | 1,68,669 | +17.0% |
2001 | 1,79,112 | +6.2% |
2011 | 1,42,004 | −20.7% |
న్యూ ఢిల్లీ జిల్లాలో 3 తాలూకాలు, 0 గ్రామాలు, 4 పట్టణాలు ఉన్నాయి. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం, న్యూఢిల్లీ జిల్లాలో 33,208 గృహాలు ఉన్నాయి. జిల్లా లోని జనాభా 1,42,004. అందులో పురుషులు 77,942 కాగా, స్త్రీలు 64,062. మంది ఉన్నారు. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల జనాభా 12.760, మంది ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 8.99% ఉంది.[12][13]
న్యూ ఢిల్లీ జిల్లా లింగ నిష్పత్తి రాష్ట్ర లింగనిష్పత్తి 868తో పోలిస్తే దాదాపు 822 ఉంది.ఇది ఢిల్లీ రాష్ట్ర ఎన్.సి.టి. సగటు. న్యూ ఢిల్లీ జిల్లా అక్షరాస్యత రేటు 80.41% అందులో పురుషులు అక్షరాస్యత రేటు 84.27% శాతం, స్త్రీల అక్షరాస్యత రేటు 75.71% శాతం ఉంది.న్యూ ఢిల్లీ మొత్తం వైశాల్యం 35 చ.కి.మీ, జనాభా సాంద్రత చ.కి.మీకి 4057. మొత్తం జనాభాలో, జనాభాలో 100% మంది పట్టణ ప్రాంతంలో 0% గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. న్యూ ఢిల్లీ జిల్లాలో మొత్తం జనాభాలో 23.41% షెడ్యూల్డ్ కులానికి చెందినవారు ఉన్నారు. 0 మంది షెడ్యూల్డ్ తెగల వారు ఉన్నారు.[13]
జిల్లా జనాభా మతం ప్రకారం
మార్చు- మొత్తం జనాభా 1,42,004
- హిందూ 1,24,482 - 87.66%
- ముస్లింలు 8,480 - 5.97%
- క్రిస్టియన్ 4,852 - 3.42%
- సిక్కులు 2,933 -2.07%
- జైనులు 6,79 -0.48%
- బౌద్ధులు 3,12 -0.22%
- మతం పేర్కొనబడనివారు - 2,00 0.14%
- ఇతర మతాలు 66 - 0.05%
మూలాలు
మార్చు- ↑ New Delhi district, retrieved 2 January 2021
- ↑ Poonam Sharma: Structure and Growth of Mega City: An Inter-industry Analysis. Concept Publishing, 2010, ISBN 978-8180696756, p. 56
- ↑ Districts of Delhi, delhionline.com, retrieved 2 January 2022
- ↑ Geeta Gupta: Delhi gets two more revenue districts: Southeast, Shahdara, Indian Express, 12 September 2012, retrieved 2 January 2022
- ↑ Prabhash K. Dutta: Beyond MCD election 2017: How 5 municipal corporations manage Delhi, why everyone can't vote tomorrow, India Today, 22 April 2017, retrieved 2 January 2022
- ↑ New Delhi district: Map of the district, retrieved 2 January 2022
- ↑ New Delhi district: Map of the district, retrieved 2 January 2022
- ↑ Districts of Delhi, delhionline.com, retrieved 2 January 2022
- ↑ Directorate of Census Operations, Delhi: Census of India 2011: N.C.T of Delhi.
- ↑ Geeta Gupta: Delhi gets two more revenue districts: Southeast, Shahdara, Indian Express, 12 September 2012, retrieved 2 January 2022
- ↑ New Delhi district: Map of the district, retrieved 2 January 2022
- ↑ "New Delhi District Population Census 2011 - 2021 - 2023, Delhi literacy sex ratio and density". www.census2011.co.in. Retrieved 2023-08-19.
- ↑ 13.0 13.1 "Demography | District New Delhi, Government of NCT of Delhi | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-19.