పంచభూతాలు (1979 సినిమా)

1979 సినిమా

పంచ భూతాలు, చిత్రం 1979 మే 19 న విడుదల . పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చంద్రమోహన్, లత త్యాగరాజు,నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు.

పంచభూతాలు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖర్ రెడ్డి
తారాగణం చంద్రమోహన్ ,
లత
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ విజయకళా ఆర్ట్స్
భాష తెలుగు

నాగరిక ప్రపంచానికి దూరంగా ఒక పల్లెటూరు. ఆ వూరి ప్రెసిడెంటు రంగారావు, అతని మేనల్లుడు ప్రసాద్, గుడి పూజారి శాస్త్రి, నగలు తయారు చేసే బ్రహ్మం, భూతవైద్యుడు భుజంగం ఈ ఐదుగురు ఆ వూరిలో ఆడింది ఆట పాడింది పాట. ఈ దుర్మార్గపు ముఠావలన ఎందరో కన్నెపిల్లల జీవితాలు నాశనమయ్యాయి. గుళ్లో నగలను దొంగిలిస్తారు. ప్రసాద్ ప్రియురాలు సుబ్బులును దెయ్యం వేషంలో రాత్రిపూట తిప్పిస్తూ వూళ్లో జరిగిన ఘాతుకాలను అమ్మవారే దెయ్యమై చేస్తున్నదని భ్రమింపజేస్తారు. గుడిలో దొరికిన ఒక రహస్య పత్రం ద్వారా గుప్తనిధి ఒకటి ఉన్నదని తెలుసుకొని దాని కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. రాము అనే యువకుడు ఊరందరికీ తలలో నాలుకలా మసులతూ, ఎవరింట్లో ఏ పని చెప్పినా కాదనకుండా సహాయపడుతుంటాడు. ఇంతలో ఆ వూరికి జానకి అనే టీచర్ వస్తుంది. రాము అమాయకత్వాన్ని, మంచితనాన్ని గుర్తించిన జానకి అనుకోని పరిస్థితులలో రాముని వివాహమాడుతుంది. రాము చేత వ్యాపారం పెట్టిద్దామనే ఉద్దేశంతో డబ్బిచ్చి, సరుకులు కొనుక్కురమ్మని రామును పట్నం పంపిస్తుంది జానకి. ఆ రాత్రే దుర్మార్గపు ముఠా జానకిని తీసుకుని పోయి బలాత్కారం చేయబోతారు. వూళ్లో జరిగిన ఘోరాలకు ఈ ముఠాయే కారణమని గ్రహిస్తుంది జానకి. ఆమె వారికి లొంగక, చచ్చి పగసాధిస్తానని శపథం చేసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె శపథం ఎలా నెరవేరిందనేది మిగిలిన కథ[1].

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • దర్శకత్వం: చంద్రశేఖర్ రెడ్డి
  • సంగీతం: ఇళయరాజా
  • నిర్మాణ సంస్థ: విజయ కళా ఆర్ట్స్.
  • నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి,
  • సాహిత్యం:కొసరాజు , సి. నారాయణ రెడ్డి, ఆత్రేయ, జాలాది.


పాటల జాబితా

మార్చు

1.ఎనేన్నో దేశాలు తిరిగాడు , రచన:కొసరాజు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

2.కవ్వించే కళ్ళల్లో కళలేవో ఏవో ఏవో , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

3. నీరైనాను నిప్పైనాను గాలైరేగాను, రచన: ఆత్రేయ, గానం.ఎస్ జానకి

4.మల్లియల్లో మాపల్లె సీమలో , రచన: జాలాది రాజారావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం .

మూలాలు

మార్చు
  1. పి.ఎస్. (25 May 1979). "చిత్రసమీక్ష - పంచభూతాలు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 58. Retrieved 19 December 2017.[permanent dead link]

. 2 .ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.