లత (జ. 1953 జూన్ 7) భారతీయ సినిమా, టెలివిజన్ నటి. ఆమె ఎం.జి.ఆర్.లత లేదా లతా సబాపతి గా సుపరిచితురాలు. [1] ఆమె దక్షిణాది భాషలలో 1973 నుండి 1983 వరకు ముఖ్యమైన పాత్రలలో నటించింది. ఆమె తమిళ భాషా సీరియల్స్ లో నటిస్తుంది.

లత
జననం
నళిని

(1953-06-07) 1953 జూన్ 7 (వయసు 70)
తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లుఎం.జి.ఆర్.లత, లతా సబాపతి
క్రియాశీల సంవత్సరాలు1973–1984
1992–2000
2002–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసబాపతి
(వి.1983–ప్రస్తుతం)
పిల్లలు2
తల్లిదండ్రులుతండ్రి : షన్ముగ రాజేశ్వర సేదుపతి
తల్లి : లీలారాణీ
గాంధీ పుట్టిన దేశం చిత్రంలో ప్రమీల, జయంతిలతో లత

ప్రారంభ జీవితం సవరించు

ఆమె షణ్ముగ రాజేశ్వర సేతుపతి, లీలారాణి దంపతులకు 1953 జూన్ 7న జన్మించింది. తన అందం, నృత్య నైపుణ్యం కారణంగా తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. ఆమె తన పదిహేనేళ్ళ వయసులో సినిమారంగంలోకి ప్రవేశించింది. ఆమెను ఆమె అత్త, సినిమానటి కోమల కోట్నిస్ ప్రోత్సహించింది.[2] ఆమె మొదటి సినిమా ఉలగం సుట్రమ్ వాలిబాన్ (1973) కు కథానాయకుడు, నిర్మాత ఎం.జి.రామచంద్రన్. [3][4] ఆమె రామ్‌నాద్ రాజరిక కుటుంబంలోని సేతుపతి వంశానికి చెందినది. ఆమె మొదట ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నివాసి. చిన్నతనం నుండి తమిళం, తెలుగు భాషలను నేర్చుకుంది[5]. ఎం.జి.ఆర్ స్వయంగా ఆమెకు స్కీన్ పేరుగా "లత" అని నామకరణం చేసాడు. ఆమె సోదరుడు రాజ్‌కుమార్ సేతుపతి.

నటించిన సినిమాలు సవరించు

మూలాలు సవరించు

  1. "About Latha –The Times of India". The Times of India.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Rediff On The NeT: An interview with Latha, former MGR heroine-turned- politician". Rediff.com. Retrieved 18 July 2018.
  3. "Rediff On The NeT: An interview with Latha, former MGR heroine-turned- politician". Rediff.com. Retrieved 18 July 2018.
  4. "உலகம் சுற்றும் வாலிபனில் எம்.ஜி.ஆர். அறிமுகம் செய்த லதா" [Latha was introduced by MGR through Ulagam Sutrum Vaaliban]. Cinema.maalaimalar.com. Archived from the original on 22 August 2019. Retrieved 18 July 2018.
  5. "நடிப்பு, நடனம் லதா பயிற்சி பெற எம்.ஜி.ஆர். ஏற்பாடு" [MGR helped Latha for practising acting and dance]. Cinema.maalaimalar.com. Archived from the original on 22 August 2019. Retrieved 18 July 2018.

బయటి లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=లత_(నటి)&oldid=3886841" నుండి వెలికితీశారు