లాలా లజపతిరాయ్

భారతీయ రచయిత మరియు రాజకీయవేత్త
(లాలా లజపతి రాయ్ నుండి దారిమార్పు చెందింది)

లాలా లజపత్ రాయ్ (జనవరి 28, 1865 - నవంబరు 17, 1928) (ఆంగ్లం : Lala Lajpat Rai) - (పంజాబీ భాష : ਲਾਲਾ ਲਜਪਤ ਰਾਯ, لالا لجپت راے; హిందీ భాష : लाला लाजपत राय) భారత్ కు చెందిన రచయిత, రాజకీయనాయకుడు. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకే గ్రామంలో జననం జనవరి 28, 1865, మరణం నవంబరు 17, 1928. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇతడిని భారతీయులు పంజాబ్ కేసరి అనే బిరుదును నొసంగారు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు, లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు.

sing saheb
జనవరి 28, 1865 - నవంబరు 17, 1928
Lala lajpat Rai.jpg
పంజాబ్ కేసరి
జన్మస్థలం: ఫిరోజ్‌పూర్., పంజాబ్, భారతదేశం
ఉద్యమం: భారత స్వతంత్ర సంగ్రామం
ప్రధాన సంస్థలు: భారత జాతీయ కాంగ్రెస్, ఆర్య సమాజ్

లాల్ (లాలా లజపత్ రాయ్), బాల్ (బాలగంగాధర తిలక్), పాల్ (బిపిన్ చంద్రపాల్) త్రయం, ఆకాలంలో లాల్-బాల్-పాల్ గా ప్రసిద్ధి. వీరిలో ఒకడు. 1928 లో భారతదేశ పర్యటనకు వచ్చిన సైమన్ విచారణ సంగము (సైమన్ కమిషన్ ) ను వ్యతిరేకిస్తూ లాలా లజపతిరాయి చేసిన ఆందోళన బ్రిటిష్ ఇండియా చరిత్రలో చాల ప్రముఖమైనది. 1920-30 దశాబ్దములో జాతీయకాంగ్రెస్సు వారి మెత్తదనపు మితవాద సిద్దాంతమును విడనాడి తీవ్రజాతీయవాదు లలో లాలా లజపతిరాయి ప్రముఖుడు. 1924 ట్రిబ్యూన్ అను పత్రికలో అనేక వ్యాసములు ప్రచురించెను తద్వారా కాంగ్రెస్సు వారు తమ తరఫున హిందు మహాసభను ప్రతినిధిగా నియమించవలసినదని ప్రతిపాదించాడు.

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు