పండిట్ రవిశంకర్

భారతీయ సంగీతకారుడు మరియు సిటార్ విద్వాంసకుడు

పండిట్ రవి శంకర్ (దేవనాగరి: रविशंकर, "పండిట్" = "learned"), ఏప్రిల్ 7, 1920లో గాజీపూర్ లో జన్మించాడు.ఇతడు అల్లావుద్దీన్ ఖాన్, హిందూస్థానీ సంగీతంలో మైహార్ ఘరానా స్థాపకులు శిష్యుడు.[1] సితార్ వాయిద్యం ద్వారా అనేక ప్రయోగాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంగీత కచేరీలు, ప్రదర్శనలు ఇచ్చిన సంగీతజ్ఞుడు.ఫ్రముఖ సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని శాండియాగోలోని స్క్రిప్స్‌ మెర్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్‌ 7, 1920లో వారణాసిలో జన్మించిన రవిశంకర్‌ హిందుస్థాని క్లాసికల్‌ సంగీతంలో పలు అవార్డులు అందుకున్నారు. మూడు సార్లు గ్రామీ పురస్కారం పొందారు. 1999లో రవిశంకర్‌ను ప్రభుత్వం అత్యున్నత పురస్కారం 'భారత రత్న'తో సత్కరించింది.

పండిట్ రవి శంకర్
రవిశంకర్ తన సితార్ వాయిస్తున్న చిత్రం.
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంరవి శంకర్
సంగీత శైలిహిందుస్తానీ సంగీతం
వృత్తికంపోజర్, సితార్ విద్వాంసుడు
వాయిద్యాలుసితార్
క్రియాశీల కాలం1939 – 11 డిసెంబర్‌ 2012
బంధువులుమమతా శంకర్ (మేనకోడలు),
ఆనంద శంకర్ (మేనళ్లుడు)
లేబుళ్ళుఏంజిల్, డార్క్ హార్స్ రికార్డ్స్, HMV, ప్రైవేట్ మ్యూజిక్
సంబంధిత చర్యలుఉస్తాద్ అల్లారఖా
యహూదీ మెనూహిన్
వెబ్‌సైటురవిశంకర్.ఆర్గ్
ముఖ్యమైన సాధనాలు
సితార్

రవిశంకర్‌ అసలు పేరు రబింద్రో శౌంకోర్‌ చౌదురి. తన బాల్యంలో నృత్యం నేర్చుకునేందుకు సోదరుడు ఉదయ్‌శంకర్‌తో కలిసి యూరప్‌ వెళ్లాడు. 1938లో నృత్యాన్ని పక్కనబెట్టి సితార్‌ నేర్చుకోవడానికి అల్లాద్దిన్‌ ఖాన్‌ అనే విద్వాంసుడి వద్ద చేరాడు. 1944లో చదువు అనంతరం మ్యూజిక్‌ కంపోజర్‌గా జీవితాన్ని ప్రారంభించి సత్యజిత్‌రే 'అప్పు' చిత్రానికి పనిచేశారు. 1949 నుంచి 1956 వరకు సంగీత దర్శకునిగా ఢిల్లీ ఆల్‌ ఇండియా రేడియోకు సేవలు అందించారు.

1956 నుంచి యూరప్‌, అమెరికాలో హిందుస్థాని క్లాసికల్‌ సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. బోధన, పదర్శనల ద్వారా హిందుస్థాని క్లాసికల్‌ సంగీతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చారు. తన కూతురు అనౌష్కతో కలిసి సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. 2003లో అనౌష్క తన మ్యూజిక్‌ అల్బమ్‌ ద్వారా గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.

అవార్డులు

మార్చు
  1. 1975లో యునెస్కో సంగీత పురస్కారం
  2. 1981లో పద్మవిభూషణ్‌ పురస్కారం
  3. 1988లో కాళిదాస్‌ సమ్మాన్‌ పురస్కారం
  4. 1992లో రామన్‌ మెగసేసే పురస్కారం ఫండిట్
  5. 1999లో అత్యున్నత పురస్కారం భారతరత్న
  6. 1986 నుంచి 1992 వరకూ రాజ్యసభలో నామినేటెడ్‌ సభ్యునిగా వ్యవహరించారు

ఇతర విశేషాలు

మార్చు

సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Ravi Shankar - Biography". Archived from the original on 2012-06-29. Retrieved 2008-05-20.

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.