పందిళ్ళపల్లి (బేస్తవారిపేట)
పందిళ్ళపల్లి ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పందిళ్ళపల్లి (బేస్తవారిపేట) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°27′46.944″N 79°5′2.688″E / 15.46304000°N 79.08408000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | బేస్తవారిపేట |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కర్నాటి మోహనరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు.
విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల- ఈ పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి చదివిన కప్పల రాజకుమారి, చిలకల శరణ్య అను విద్యార్థినులు, 10వ తరగతిలో విశేష ప్రతిభ కనబరచి, ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ప్రతిభా పురస్కారం అందుకున్నారు.
మహాత్మాగాంధీ ఎయిడెడ్ పాఠశాల - ఈ పాఠశాల పందిళ్ళపల్లిలోని ఎస్.సి.కాలనీలో ఉంది.
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల - ఈ పాఠశాల గ్రామం లోని పంచాయతీ కార్యాలయం దగ్గర ఉంది. ఇందులో ఆనంద లహరి అభ్యసనం ద్వారా బోధన జరుగుతుంది. ఈ విధమైన అభ్యసన బెస్తవారిపేట మండలంలో రెండు పాఠశాలలో మాత్రమే జరుగుతుంది. అందులో ఈ పాఠశాల ఒకటి.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- శ్రీ కోదండరామస్వామివారి ఆలయం
- శ్రీ ఉగ్ర ఆంజనేయస్వామివారి ఆలయం - ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవం (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. ఉదయం అభిషేకం, ఆకుపూజలు, అర్చనలు నిర్వహించెదరు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో, రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శనలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేయుదురు.
గ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామాభివృద్ధికి హోథ్స్ సంస్థవారు తమ అంగీకారాన్ని తెలియజేసినారు.
పందిళ్ళపల్లి టోల్ ప్లాజా
మార్చుపందిళ్ళపల్లి పల్లె గ్రామ బస్ స్టాండ్ వద్ద ఒక టోల్ ప్లాజా నిర్మాణానికై 2020, నవంబరు-10న శంకుస్థాపన నిర్వహించారు.