పంపరపనస ఒక నిమ్మ జాతికి చెందిన పండు.ఆ పండును పోటిలో అని కూడా అంటారు. ఇది రుటాసి కుటుంబానికి చెందిన సిట్రస్ చెట్టు దీనిని పోమెలో అని కూడా పిలుస్తారు, వెస్టిండీస్ ,అమెరికాలో ఇది గృహ వినియోగానికి ఒక పండుగా పేర్కొనబడినది .ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అల్పాహారం పండ్లుగా ప్రాచుర్యం పొందింది, అమెరికా , ఇజ్రాయెల్, సైప్రస్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాలకు ఈ పండు విస్తరించింది. విటమిన్ సి యొక్క మూలంగా ఉన్న పండు. ఇది 4.5 నుండి 6 మీటర్లు (15 నుండి 20 అడుగులు) ఎత్తులో ఉండవచ్చు. ఆకులు చాలా దట్టమైనవి, పువ్వులు పెద్దవి, తెలుపు రంగులో ఉంటాయి, పండినప్పుడు చాలా రకాలు పసుపు రంగులో ఉంటాయి. ఈ పండు 100 నుండి 150 మిమీ (4 నుండి 6 అంగుళాలు) వ్యాసం కలిగి ఉంటుంది, దీని పరిమాణం రకాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీని గుజ్జు లేత ,పసుపు, తేలికపాటి పులుపు రుచి ఉంటుంది. ఇతర రకాలు ఎరుపు గుజ్జు కలిగి ఉంటాయి [1]

పంపరపనస
Citrus paradisi (Grapefruit, pink) white bg.jpg
పంపరపనస (Grapefruit)
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. × paradisi
Binomial name
Citrus × paradisi
Macfad.

పెరుగుదల- ఉపయోగము : దీని పెరుగుదల సమ, ఉపఉష్ణమండల వాతావరణంలో, పువ్వులు వచ్చే నుండి , పండ్ల పరిపక్వత వచ్చే వరకు వాతావరణం పండ్ల పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. ఈ చెట్లకు సమతుల్యమైన మందులు వాడవలెను లేకపోతే తెగులు వచ్చే ప్రమాదం ఉన్నది . ఈ పండ్లను కొత్త ఆహారంగా, శరీర బరువును నియంత్రించే పండుగా ప్రచారం చేయబడి , ఒక ప్రణాళిక ద్వారా పెంచబడింది. 1983 లో, అమెరికాలో తాజా పండ్లు వినియోగించే, కూరగాయలలో ఈ పండు వినియోగం పెరిగినదని మించిందని నివేదించింది ( యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సర్వీస్) . వివిధ దేశాలలో ఈ పండును క అల్పాహారం పండు గా , కొంతమంది రసముగా ( జ్యూస్ ) గా చక్కెర,లేదా తేనెతో కలుపుకొంటారు. ఎన్నో పోషకాలతో ఈ పండు ప్రజల ఆహారంలో ఒక భాగముగా చెప్పవచ్చును [2] వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉన్నా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి ( విటమిన్లు ఎ ,సి ) ఎక్కువగా ఉంటాయి. రక్తపుపోటు నియంత్రణ , గుండె సంరక్షణ ,, మధుమేహం, కాన్సర్ , బరువు నియంత్రణ , చర్మ సంరక్షణ , శరీరములో రోగనిరోధక శక్తి ని పెంచడం గా ప్రజల ఆరోగ్యములో ఈ పండ్లు తోడ్పడుతాయి [3]

  1. "grapefruit | Description, Cultivation, & Facts". Encyclopedia Britannica (in ఆంగ్లం). Retrieved 2020-11-05.
  2. "Grapefruit". hort.purdue.edu. Retrieved 2020-11-05.
  3. "Grapefruit: Benefits, facts, and research". www.medicalnewstoday.com (in ఆంగ్లం). 2019-11-07. Retrieved 2020-11-05.
"https://te.wikipedia.org/w/index.php?title=పంపరపనస&oldid=3056400" నుండి వెలికితీశారు