పచ్చిపాల దొరస్వామి ( పిసి దొరస్వామి )

పచ్చిపాల దొరస్వామి ( పిసి దొరస్వామి ) పారిశ్రామికవేత్త, సంఘ సేవకుడు. ఈయన బ్రాండిక్స్ ఇండియా అపెరల్‌ సిటీ (BIAC) భారతీయ భాగస్వామి హోదాలో వున్నారు. ఈయనను బ్రాండిక్స్ దొరస్వామిగా కూడా పిలుస్తారు.

జీవిత విశేషాలు

మార్చు

దొరస్వామి చిత్తూరు జిల్లా తిరుపతి పుణ్యక్షేత్రం సమీపంలోని బాట గుండ్రేవారి పల్లి గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి రెడ్డెప్ప, తల్లి కమలమ్మ. దొరస్వామి తొమ్మిది మంది సంతానంలో చివరివాడు. చిన్నతనం నుంచీ సృజనాత్మక అంశాలపై దృష్టి కేంద్రీకరించే దొరస్వామి హైదరాబాదు జే.ఎన్.టి.యు. లో ఫైన్ ఆర్ట్స్ (BFA) చదివారు. సృజనతో ముడిపడ్డ పబ్లిసిటీ రంగంలో అడుగుపెట్టి టచ్ స్టోన్ పేరిట ఒక కంపెనీ స్థాపించారు. ప్రభుత్వ పథకాలకు సంభందించి విద్యా, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలకు సంభందించి ప్రకటనల రూపకల్పనలో టచ్ స్టోన్ గుర్తింపు సాధించింది. టచ్ స్టోన్ సంస్థ ఆర్కిటెక్చర్ డిజైన్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా ప్రవేశించి గుర్తింపు సాధించింది.

బ్రాండిక్స్ దొరస్వామి

మార్చు
 

విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి సమీపంలోని అచ్యుతాపురం వద్ద వున్న సెజ్ లోని వెయ్యి ఎకరాల్లో బ్రాండిక్స్ ఇండియా అపెరల్‌ సిటీ ( వస్త్ర పరిశ్రమ ) వుంది. దొరస్వామి 2016లో బ్రాండిక్స్ భారతీయ వ్యాపార భాగస్వామిగా భాద్యతలు స్వీకరించాక పరిశ్రమలో కార్మికులకు అవసరమైన అనేక వృత్తి పరమైన సంస్కరణలు, మార్పులు తీసుకువచ్చారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, ఉచిత మహిళా వైద్య శిబిరాలు, ఉచిత కేన్సర్ వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు నిర్వహించి, ఇప్పటి వరకూ 40 వేల మందికి కంటి సంబంధిత వ్యాధులు నయం చేయించి గుర్తింపు సాధించారు.

మహిళా కృషి అవార్డు (HE FOR SHE) 2019కు ఎంపికైన బ్రాండిక్స్ దొరస్వామి  

మార్చు
 

బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ (BIAC) ఉమెన్ ఆన్ ఏ మిషన్ 2019' (మహిళా కృషి ) అవార్డుకు ఎంపికయ్యారు. మార్చి 6న బెంగుళూరులో జరిగిన మహిళా సదస్సులో దొరస్వామి ఆవార్డును సంఘసేవకులు, రచయిత్రి సుధా నారాయణ మూర్తి చేతులమీద స్వీకరించారు. మహిళల సాధికారత కోసం కోసం కృషి చేస్తున్న పురుషుల విభాగం ( ఆమె కోసం అతను) ( He for She ) లో దొరస్వామి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 18 వేల మందికి పైగా మహిళలు ఉపాధి పొందుతున్న బ్రాండిక్స్ పరిశ్రమలో మహిళా ఉద్యోగులకు అండగా..బాసటగా నిలుస్తూ దొరస్వామి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మహిళా ఉద్యోగులతో పాటు బస్సుల్లో ప్రయాణిస్తూ,వారి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మహిళా ఉద్యోగుల భద్రత,ఆరోగ్యం  విషయంలో దొరస్వామి  శ్రద్ధ తీసుకుంటున్నారు.దొరస్వామి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఇప్పటివరకూ విశాఖ జిల్లాలో 56 నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించి 40 వేల మందికి పైగా కంటి పరీక్షలు జరిపించారు, వారిలో 4000 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేయించారు. ప్రతి నెల 1వ, 3వ ఆదివారాలు  బ్రాండిక్స్ వారు ఉచిత ఆడపిల్లల వైద్య ఆరోగ్య శిబిరం, మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఈ తరహా ఇప్పటివరకూ 34 ఉచిత వైద్య శిబిరాల ద్వారా 10 వేల మందికి పైగా  గ్రామీణ ప్రాంతాల మహిళలకు వైద్యసహాయమందించారు. పాఠశాల విద్యార్ధులకు 10 లక్షల శానిటరీ నాప్ కిన్ లు అందజేశారు. గత 31 వారాలుగా గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రతి ఆదివారం శానిటరీ నాప్ కిన్ లు పంపిణీ చేస్తూ, శానిటరీ నాప్ కిన్స్ వాడకం, ఉపయోగం వాటి లాభాల గురించి వివరిస్తున్నారు.పాఠశాలల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్.ఓ వాటర్ ప్లాంట్ లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు.  

మూలాలు

మార్చు
  1. హార్వర్డ్ యూనివర్శిటీలో 16వ ఇండియా కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు దొరస్వామికి ఆహ్వానం Archived 2019-04-11 at the Wayback Machine
  2. బ్రాండిక్స్‌ దొరస్వామికి మహిళా కృషి అవార్డు[permanent dead link]
  3. How this intimate apparel factory manufacturing for the likes of Victoria’s Secret and Calvin Klein is empowering 18,000 women in rural Andhra Pradesh