పటిసిరాన్
పాటిసిరన్, అనేది ఆన్పాత్రో బ్రాండ్ పేరు క్రింద విక్రయించబడింది. ఇది వంశపారంపర్య ట్రాన్స్‌థైరెటిన్-మధ్యవర్తిత్వ అమిలోయిడోసిస్ ఉన్న వ్యక్తులలో పాలీన్యూరోపతి చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది సిరలోకి క్రమంగా ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[2]
Clinical data | |
---|---|
వాణిజ్య పేర్లు | ఆన్పాత్రో |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | D (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) |
Routes | ఇంట్రావీనస్ |
Identifiers | |
CAS number | 1420706-45-1 |
ATC code | N07XX12 |
DrugBank | DB14582 |
UNII | 50FKX8CB2Y |
KEGG | D11116 |
Synonyms | ALN-18328 |
Chemical data | |
Formula | C412H520N148O290P40 |
ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, శ్వాస ఆడకపోవడం, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఎరుపు, మైకము వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలు విటమిన్ ఎ లోపం కలిగి ఉండవచ్చు.[1] గర్భధారణలో భద్రత అస్పష్టంగా ఉంది.[1] ఇది అసాధారణమైన ట్రాన్స్‌థైరెటిన్ ఉత్పత్తిని నిరోధించే రైబో కేంద్రక ఆమ్లం చిన్న భాగం.[3]
పాటిసిరన్ 2018లో యూరప్, యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3][1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి NHS కి 10 మి.గ్రా.ల ఒక సీసా ధర దాదాపు £7,700[2] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం సుమారు 10,000 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Patisiran Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2021. Retrieved 26 October 2021.
- ↑ 2.0 2.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1109. ISBN 978-0857114105.
- ↑ 3.0 3.1 "Onpattro". Archived from the original on 8 November 2020. Retrieved 26 October 2021.
- ↑ "Onpattro Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 24 June 2021. Retrieved 26 October 2021.