పఠాన్ జిల్లా

గుజరాత్ లోని జిల్లా

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో పఠాన్ జిల్లా (గుజరాతీ:પાટણ જિલ્લો) ఒకటి. పఠాన్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.జిల్లా గుజరాత్ రాష్ట్ర ఉత్తర భూభాగంలో ఉంది. జిల్లా వైశాల్యం 5740 చ.కి.మీ. జిల్లాలోని హర్జి, సమి కచ్ సరిహద్దు ప్రాంతం చాలా సున్నితమైనవి. ఇక్కడి నుండి పాకిస్థాన్ సరిహద్దు వరకు నివాసాలు లేకపోయినప్పటికీ దేశ సరిహద్దు మాత్రం దూరంగానే ఉంది.

Districts of Northern Gujarat
Rani-Ki Vav in Patan

సరిహద్దులుసవరించు

పఠాన్ జిల్లా ఉత్తర, ఈశాన్య సరిహద్దులో బనస్ కాంతా జిల్లా, తూర్పు, ఆగ్నేయ సరిహద్దులో మహెసనా జిల్లా, తూర్పు, దక్షిణ సరిహద్దులో సురేంద్రనగర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో కచ్ జిల్లా, కచ్ ను నాను రాన్ ఉన్నాయి.

పేరువెనుక చరిత్రసవరించు

జిల్లాకేంద్రం అయిన పఠాన్ పేరు జిల్లాకు పెట్టబడింది. గుజరాత్ ప్రాంతానికి పురాతన, మధ్యయుగ ప్రారంభంలో ఇది రాజధానిగా ఉండేది. కె.ఎం ముంషీ నవలలలో ఈ ప్రాంతం ప్రస్తావన ఉంది. రాజా వనరాజ్ చవదా ఈ నగరాన్ని స్థాపించి దీనికి తన విశ్వసపాత్రుడు రాజ్యస్థాపనకు మారదర్శి, ప్రాణ మిత్రుడు అయిన అనహిల్‌పూర్ పఠాన్ (అనహిల్‌వద్ పఠాన్) పేరు పెట్టాడు. అప్పటి దక్షిణ దేశపు రాజు ఆధినంలో ఉన్న రాజును ఎదిరిస్తూ ప్రాంతీయ గిరిజనులు, పౌరులు, పంచసారా రాజు వనరాజు చవద తండ్రి సైన్యంలోని యుద్ధవీరుల సాయంతో దీర్ఘకాలం యుద్ధం చేసి ఈ ప్రాంతం మీద విజయం సాధించి పఠాన్ రాజ్యస్థాపన చేసాడు. తరువాత ఈ ప్రాంతాన్ని భీందేవ్, కుమర్‌పాల్, సిద్ధరాజ్, కామదేవ్ వంటి పలువురు పాలించారు. .

చరిత్రసవరించు

పఠాన్ జిల్లా 2000లో రూపొందించబడింది. మునాటి మహెసనా జిల్లాలోని సమి, హరిజ్, చనాస్మ, సిధ్పూర్, పఠాన్ తాలూకాలనూ, మునుపటి బనస్ కాంతా జిల్లాలోని రాధన్‌పూర్, సాంతల్‌పూర్ తాలూకాలను కలిపి పఠాన్ జిల్లా రూపొందించబడింది.

విభాగాలుసవరించు

జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి : పటాన్, సంతల్పుర్, ఉన్నరధన్పూరు, సిద్ధ్పుర్, హరిజ్, సామీ, చనస్మ.

పర్యాటక ఆకర్షణలుసవరించు

జీల్లాప్రధాన కార్యాలయం పటాన్ (గుజరాత్) నగరంలో ఉంది. పటాన్, మొదెర పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి. పఠాన్ నగరంలో పలు సంప్రదాయ వారసత్వం, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు ఉన్నాయి. సహస్రలింగాల సరసు, రణకై వావ్ (లోతైన బావి), పంచసర్ జైన్ ఆలయంలో జైన్ సంప్రదాయానికి సంబంధించిన పలు పురాతన వ్రాతపతులు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికీ 150 కంటే అధికమైన జైన్ ఆలయాలు ఉన్నాయి. వీటిలో పంచసర్ పర్స్వనాథ్, షమ్ల ఆలయాలు చాలా ఖ్యాతి గడించాయి. పటాన్‌లో పలు వైద్యకేంద్రాలు ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రానికి పఠాన్ మెడికల్ కేంద్రమని నిస్సహాయంగా చెప్పవచ్చు.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,342,746,[1]
ఇది దాదాపు. స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. మైనే నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 359వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 234 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.53%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే. 935:1000 [1]
అక్షరాస్యత శాతం. 73.47%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

సోలార్ ప్రాజెక్ట్సవరించు

గుజరాత్‌లో ఆసియాలోనే 500 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన అతిపెద్ద సోలార్ ఎనర్జీ పార్క్ స్థాపినాచాలని ప్రతిపాదించారు.

See alsoసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. CS1 maint: discouraged parameter (link)
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Swaziland 1,370,424 line feed character in |quote= at position 10 (help)CS1 maint: discouraged parameter (link)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Maine 1,328,361 line feed character in |quote= at position 6 (help)CS1 maint: discouraged parameter (link)

వెలుపలి లింకులుసవరించు

మూలాలుసవరించు

మూలాలజానితాసవరించు

మూలాలుసవరించు