పడవల నారాయణరావు

పడవల నారాయణరావు ప్రముఖ చిత్రకారుడు.[1]

వీరు 1949లో జన్మించారు. సెకండరీ విద్యను పూర్తిచేసిన వీరు మేనమామగారైన బిట్రా శ్రీనివాసరావు గారి వద్ద డ్రాయింగ్, పెయింటిగ్ లో శిక్షణ పొందారు. పిదప గొట్టుముక్కల కోటేశ్వరరావు గారి వద్ద అనేక మెళుకువలు నేర్చుకొన్నారు.

నారాయణరావుగారు స్వంత ఇంటివద్దనే "చిత్రకళా శిక్షణాలయం" స్థాపించి 25 సంవత్సరాలుగా ఉచితముగా దాదాపు 400 మంది బాలబాలికలకు, ఔత్సాహికులకు చిత్రలేఖనంలో శిక్షణ ఇచ్చారు. వీరివద్ద శిక్షణ పొందిన అనేకమంది వివిధ రంగాలలో పనిచేయుచూ కీర్తిప్రతిష్ఠలు పొందుచున్నారు.

వీరు చిత్రించిన అనేక భావచిత్రాలు ప్రముఖ దిన, వారపత్రికలలో ప్రచురితమైనాయి. మలయాళ స్వాములవారి నిలువెత్తు చిత్రం, హానిమన్, కెంట్, గాంధీ, రవీంద్రనాధ్ ఠాగూర్ మొదలైన తైలవర్ణ చిత్రాలు ప్రముఖమైనవి. వీరి ఊహాచిత్రాలలో శకుంతలను కణ్వముని అత్తవారింటికి పంపుట, కాలులో ముల్లు, సాగరతీరం, వసంతగానం, కలువకన్య, మేఘబాల, స్వాతిముత్యం, పల్లెపడుచు, మేలుకొలుపు, కుప్పనూర్పిడి, సంక్రాంతి లక్ష్మి మొదలైనవి మంచి పేరు తెచ్చాయి. జానపద సంప్రదాయ చిత్రాలు సుమారు 30 వరకు చిత్రించారు.

సన్మానాలు మార్చు

రేపల్లెలో యునెస్కో క్లబ్ కన్వీనర్ శ్రీ భట్టు హరిబాబు అంతర్జాతీయ యునెస్కో క్లబ్ (ప్యారిస్) స్వర్ణోత్సవాల సందర్భంగా వీరికి "చిత్రకళాభూషణ" బిరుదును ప్రదానం చేసి, సత్కరించారు.

మూలాలు మార్చు

  1. శ్రీ పడవల నారాయణరావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, 2006, పేజీలు: 422-4.