పడాల భూదేవి
పడాల భూదేవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త. సవర మహిళల కుటుంబ ఆహారాన్ని మెరుగుపరచడంలో వారికి సహాయం చేస్తోంది. 2020 మార్చిలో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి నారీశక్తి పురస్కారం అందుకుంది.[1]
పడాల భూదేవి | |
---|---|
జననం | |
వృత్తి | డాక్టర్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సామాజిక కార్యకర్త |
పిల్లలు | ముగ్గురు కుమార్తెలు |
జీవిత విశేషాలు
మార్చుభూదేవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేట ప్రాంతంలో నివసిస్తున్న సవర గిరిజన తెగకు చెందిన మహిళ.[2] పదకొండు సంవత్సరాల వయస్సులో భూదేవికి వివాహం జరిగింది, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబం ద్వారా మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురైంది.[3] భూదేవి తండ్రి "ఆదివాసీ వికాస్ ట్రస్ట్" పేరుతో స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు.[3] 1984నుండి ఈ సంస్థ ద్వారా సహాయం చేయడం ప్రారంభించింది.[4]
సామాజిక సేవ
మార్చు2013లో నెదర్లాండ్స్, చైనా మొదలైన దేశాలను సందర్శించి విత్తనాలను పండించడం వంటి అంశాలలో పరిశోధన చేసింది.[3] ధాన్యానికి సంబంధించి, రైతులకు ఉత్పత్తిలో సహాయం చేయడంకోసం ప్రారంభించిన రెండు కంపెనీలకు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.[4] "ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ"తో కలిసి పనిచేసింది. మహిళలు, పిల్లల ఆహారాన్ని మెరుగుపరచడంలో వారికి సహాయం చేసింది.[5]
పురస్కారాలు
మార్చు2020 మార్చిలో భారతదేశంలోని మహిళలకు అందించే అత్యున్నత పురస్కారంతో గుర్తింపు పొందింది. ఆమె కృషిని గుర్తించి భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భూదేవికి నారీశక్తి పురస్కారాన్ని అందించాడు.[4] మహిళలు, వితంతువులు పారిశ్రామికవేత్తగా ఎలా ఉండాలనే విషయంలో భూదేవి రోల్ మోడల్‌గా పనిచేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Nari Shakti Award presented by President Ram Nath Kovind to Padala Bhudevi". The New Indian Express. 2020-03-09. Archived from the original on 2020-03-11. Retrieved 2022-07-30.
- ↑ 2.0 2.1 "PM Modi praises 'Nari Shakti Puraskar' awardee Padala Bhudevi for her efforts". ANI News (in ఇంగ్లీష్). Retrieved 2022-07-30.
- ↑ 3.0 3.1 3.2 Rao, Madhu (2020-03-08). "Who is Padala Bhudevi, helped tribal women of Andhra in developing entrepreneurship". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-30.
- ↑ 4.0 4.1 4.2 "Nari Shakti Puraskar for AP woman Padala Bhudevi from Srikakulam". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2020-03-08. Retrieved 2022-07-30.
- ↑ "Padala Bhudevi receives Nari Shakti Puraskar". Devdiscourse (in ఇంగ్లీష్). Retrieved 2022-07-30.