పతిభక్తి (1943 సినిమా)
పతిభక్తి 1943 లో విడుదలైన తెలుగు సినిమా.[1] బొంబాయి స్టూడియోస్ లిమిటెడ్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో పి.ఎస్.శ్రీనివాస రావు, దాసరి సుభద్ర, మేడూరి సుబ్బారావు, టి.శాంతాదేవి,మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం , పి.ఎస్.శ్రీనివాసరావు.గీత రచన జంపన చంద్రశేఖరరావు.
పతిభక్తి (1943 తెలుగు సినిమా) | |
![]() పతిభక్తి సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.ఎన్.శ్రీనివాసరావు |
తారాగణం | పి. ఎస్. శ్రీనివాసరావు, బి.టి. మూర్తి, మేడూరి సుబ్బారావు, దాసరి సుబధ్ర, లలిత, టి. శాంతాదేవి |
గీతరచన | జంపన |
సంభాషణలు | జంపన |
నిర్మాణ సంస్థ | బొంబాయి స్టుడియోస్ లిమిటెడ్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: పి.ఎస్.శ్రీనివాసరావు
- మాటలు:జంపన చంద్రశేఖరరావు
- పాటలు: జంపన చంద్రశేఖరరావు
- గాయనీ గాయకులు:లీలాకుమారి , దాసరి సుభద్ర, కె.సూర్యనారాయణ, శ్రీనివాసరావు, టి.శాంతాదేవి
- నిర్మాణ సంస్థ: బొంబాయి స్టూడియోస్ లిమిటెడ్
- విడుదల:1943.
పాటలు
మార్చు- ఏమోయి కోయిలా రావోయి కోయిలా ఆటలలో పాటలలో - లీలాకుమారి
- ఏలనే కోయిలా ఈ వేళ నీ గోల పడచుతనమేలనే - దాసరి సుబధ్ర
- కష్టసుఖములు సృష్టిలో కలసియుండు (పద్యం) - కె. సూర్యనారాయణ
- జయమేదో వేగనవేరా యశమేదో వేగనవేరా - శ్రీనివాసరావు
- నా బ్రతుకే యిటులాయె జగతి ఏదిగతి - శ్రీనివాసరావు
- నేవెలిపోతా రేపల్లెకు బావా హ హ హ మొగుడొద్దు -
- పతియే సతికిల గతియౌ శుభావహమౌ - శ్రీనివాసరావు, దాసరి సుబధ్ర
- ప్రేమ మయమీ జగతీ ఆహా హృదయమ్ము పొంగెను - దాసరి సుబధ్ర
- ప్రేమలు పొంగే వెన్నల నిండే ప్రేమమయామృత - శ్రీనివాసరావు, టి. శాంతాదేవి