తామర పువ్వు
(పద్మ నుండి దారిమార్పు చెందింది)
తామర పువ్వు (లేదా పద్మము) (ఆంగ్ల భాషలోLotus flower) చాలా అందమైనది. తామర పువ్వు మొక్కల ఆకులు గుండ్రంగా, ఆకుల కాడలపై చిన్న చిన్న ముళ్ళు కలిగియుంటుంది. తామర పువ్వు ఆకుల పైభాగం నీటితో తడవకపోవడం విశేషం. తామర పువ్వు మొక్కలు ముఖ్యంగా కోస్తా తీర గ్రామాల్లో ఉండే మంచినీటి చెరువుల్లో కనిపిస్తాయి. వీటి ఆకులు కటికవాళ్ళు మాంసం ప్యాక్ చేయడానికి వాడతారు. తామర పువ్వుల్లో తెలుపు, లేత గులాబీ రంగు రకాలున్నాయి. ముద్ద లేత గులాబీ రంగు తామర పువ్వు భారత దేశ జాతీయ పుష్పం.
Nelumbo nucifera | |
---|---|
Nelumbo nucifera flower | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | N. nucifera
|
Binomial name | |
Nelumbo nucifera | |
Synonyms | |
|
లక్షణాలు
మార్చు- భూగర్భ కొమ్ముగల బహువార్షిక గుల్మం.
- ఇంచుమించు గుండ్రంగా ఉన్న సరళ పత్రాలు.
- ఏకాంతంగా పొడుగాటి వృంతాలతో ఏర్పడిన తెల్లని లేదా లేత గులాబీ రంగు పుష్పాలు.
- గుండ్రటి పుష్పాసనంలో అమరియున్న అసంయుక్త ఫలదళాలు.
ఉపయోగాలు
మార్చు- తామర పువ్వులు సువాసన కలిగి అందముగా ఉండడం వలన పుష్పపూజలలో ఉపయోగిస్తారు.
- దీని పుష్పాలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
- దీని పువ్వుల రసము దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావము తగ్గించుటకు వాడెదరు.
- ఆయుర్వేద వైద్యంలో చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు
-ఇతర విశేషాలు
మార్చు- తామర పువ్వును (ఆంగ్లం లో : Lotus )అని పిలుస్తారు. చాలా మందికి తామర పువ్వుకు, కలువ పువ్వు కు ఉన్న తేడాలు తెలియవు. కలువ పువ్వు నింఫియా కుంటుంబానికి చెందినది. కలువ పువ్వు ఆకుల కు మధ్యలో కట్ ఉండి తేలిగ్గా నీటిలో తడుస్తాయి, కాడలు సున్నితంగా ఉంటాయి. కలువ పువ్వులు వందలాది రంగుల్లో లభిస్తాయి. కలువు పువ్వు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రీయ పుష్పం. తామర విత్తనములను కూరల్లో పూల్ మఖానా (Pool Makhana) అనే పేరుతో వాడతారు.
చిత్రమాలిక
మార్చు-
కలువ పువ్వుపై తేనెటీగ
-
కలువ పువ్వులు.
-
కలువ పువ్వు.
-
గులాబీ రంగు గల కలువ పువ్వు.
-
'నింఫియా అల్బా' కలువ పువ్వు.
-
A blossom in formation
-
Budding blossom
-
An opening blossom
-
Fully opened flower
-
Seed head without petals
-
Another Seed head without petals
-
More developed seed head
-
A dried seed head and a new blossom