పద్మావతి 1970 మే 3వ తేదిన శ్రీమతి సత్యవతి, కోట రామచంద్రరావు దంపతులకు జన్మించారు. వీరికి రంగస్థలనటిగా 16 సంవత్పరాల అనుభవం ఉంది. చాలా సాంఘిక నాటిక/నాటకల్లో ప్రధాన స్త్రీ పాత్రలను పొషించారు.

నటిగా

మార్చు

ఎవర్ గ్రీన్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా, స్పృహ, మేడిపండు, సరిలేరు నీకెవ్వరు, పునరపి, గద్దొచ్చే కోడిపిల్ల, నేషనల్ హైబే, కొత్త చెప్పులు, సర్పయాగం, నత్వం శోచిత మర్హసి, అమీబ, యత్ర నార్యస్తు పూజ్యంతే, మరో సంఘటన, తపస్సు, కాలజ్ఞానం, జారుడు మెట్లు, గిజిగాడిగూడు, కాంచన మృగం, మంచుబొమ్మలు, వాయిదాల పెళ్ళి, ఊరుమ్మడి బతుకులు, పుటుక్కుజరజర డుబుక్కుమే, వఱుడు, పుట్టలో ఏలెడితే కుట్టనా, పృథ్వీసూక్తం, దోశేచవహ్ని, యువర్స్ ఫేత్ పుల్లీ, పాత్రోపాఖ్యానం, ముద్దుబిడ్డ, బతుకు పుస్తకం, చీమాచీమా ఎందుక్కుట్టావ్, చిరస్మరణీయులు, అంతా భ్రాంతియే, జీవనయానం మొదలగు నాటికల్లో నటించారు

రేడియో ద్వారా

మార్చు

మరో మొహెంజోదారో, తూర్పు రేఖలు, ఈ మంటలార్పండి, తొలిపొద్దు, అల్లూరి సీతారామరాజు, లాకప్, సహజీవనం, పడమటిగాలి, తప్పటడుగు, ప్రేక్షకుడు, ఉరి, ఆత్మకథ, అడవిలో అక్షరాలు మొదలగు నాటకాల్లో, ఆకాశవాణి – విజయవాడ ‘బి’ గ్రేడ్ ఆర్టిస్ట్ గా ఉన్న ఈవిడ దశమగ్రహం, ఆనందరావు ఆరోగ్య సూత్రాలు అనే రేడియో నాటకల్లో నటించారు.

ఇతర విశేషాలు

మార్చు

ప్రస్తుతం వీరు జనచైతన్య సాంస్కృతిక సమితి – ఒంగోలు కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు.

మూలాలు

మార్చు

పద్మావతి. ఎల్, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 56.