ఒంగోలు

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని పట్టణం


ఒంగోలు నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం, ఒంగోలు మండలానికి కేంద్రం. ఈ నగరం పరిపాలన ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ (O.M.C) ద్వారా చేయబడుతుంది. [1]

ఒంగోలు
నగరం
ఒంగోలు is located in Andhra Pradesh
ఒంగోలు
ఒంగోలు
నిర్దేశాంకాలు: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E / 15.5; 80.05Coordinates: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E / 15.5; 80.05 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఒంగోలు మండలం
విస్తీర్ణం
 • మొత్తం132.45 కి.మీ2 (51.14 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం2,04,746 (2,011) 12,864 (1,901) 13,286 (1,911) 14,276 (1,921) 16,672 (1,931) 21,184 (1,941) 27,810 (1,951) 35,804 (1,961) 53,330 (1,971) 85,302 (1,981) 1,28,648 (1,991) 1,53,829 (2,001) 2,52,739
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (8592 Edit this at Wikidata)
పిన్(PIN)523001 Edit this at Wikidata
జాలస్థలిhttps://ongole.cdma.ap.gov.in/ Edit this at Wikidata

చరిత్రసవరించు

 ఒంగోలు సమీపంలోని చినగంజాంలో దొరికిన ఆధారాలను అనుసరించి మౌర్య, శాతవాహనుల పాలన కాలంలోనే ఈ పట్టణం రూపుదిద్దుకున్నట్లు ఋజువౌతుంది. శాతవాహనుల తరువాత కాకతీయుల పాలనలో ఈ పట్టణం వెలుగులోకి వచ్చింది. ఆ సమయలో మోటుపల్లి, వాడరేవు ప్రసిద్ధ రేవు పట్టణాలుగా ఉన్నాయి. రెడ్డి రాజులు మొదట ఒంగోలు సమీపములోని అద్దంకిని రాజధానిగా పాలించారు. వంగవోలు రాజులు పరిపాలించారు కాబట్టి ఈ ప్రాంతానికి వంగవోలు అనే పేరు వచ్చింది . కాలక్రమేణా వంగవోలు పేరు ఒంగోలుగా స్థిరపడి పోయింది కడప నవాబుల పాలనలో ఉన్న ఒంగోలు పట్టణాన్ని కర్ణాటక నవాబు హైదర్ అలీకి దత్తం చేయబడింది. 1801లో టిప్పూ సుల్తాన్ వద్ద నుండి బ్రిటీషు పాలనలోకి వచ్చింది.[2] ఒంగోలు పట్టణాన్ని మునిసిపాలిటీగా 1876లో వ్యవస్థీకరించారు.[3] ఆంధ్ర కేసరిగా సుప్రసిద్ధులైన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి బాల్యం ఒంగోలులోనే గడిచింది.

ఒంగోలుజాతి ఎద్దులు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఎద్దులు. ప్రఖ్యాతిచెందిన జేబూ (Zebu) జాతి ఎద్దులలో ఇవి ఒకటి.

 
ఒంగోలు గిత్త

జనాభా వివరాలుసవరించు

2011 జనాభా ప్రకారం, 204,746. ఇందులో 102,835 మగవారు, 101,911 ఆడవారు ఉన్నారు. 19,744 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఇందులో 10,228 అబ్బాయిలు, 9,516 అమ్మయిలు. ఈ నగరం అక్షరాస్యత 83.04% అనగా 153,628 మంది అక్షరాస్యులు ఉన్నారు.[4] జనాభాపరంగా ఆంధ్రప్రదేశ్ లో 13వ పెద్ద నగరం.[5]

పౌర పరిపాలనసవరించు

ఒంగోలు పురపాలక సంస్థ 1876లో స్థాపించారు. దీని ప్రస్తుత అధికార పరిది 25.00 km2 (9.65 sq mi). ఎస్.వెంకట కృష్ణా ప్రస్తుత పురపాలక సంస్థ కమీషనర్.[6]

రవాణా సౌకర్యంసవరించు

రహదారి మార్గంసవరించు

 
ఒంగోలు వద్ద జాతీయ రహదారి 5
 
ఒంగోలు రైలు స్టేషను

జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 216 నగరంగుడా వెళ్ళే జాతీయ రహదార్లు. ఒంగోలు బస్ స్టేషన్ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడుపుతుంది.[7][8]

రైల్వేలుసవరించు

ఒంగోలు రైల్వే స్టేషను హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ఉంది. ఇది విజయవాడ రైల్వే డివిజను లోని దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన A-గ్రేడ్ రైల్వే స్టేషను.[9]

ప్రతిపాదనలుసవరించు

ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఫిబ్రవరి 2014లో ఆమోదించారు.[10]

విద్యా సౌకర్యాలుసవరించు

ఆధునిక విద్యసవరించు

రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,[11], క్యు.ఐ.ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,[12] ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ,[13] దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పి.వి,ఆర్ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ థెరెస్సా ఉన్నత పాఠశాల, లూయీస్ బ్రెయిలీ అంధుల పాఠశాల

వేదవిద్యసవరించు

భరద్వాజ మహర్షి వేద విద్యా మండలి (అలూరి సీతారామమ్మ-రామకోటేశ్వరరావు పాఠశాల)

వైద్య సౌకర్యాలుసవరించు

ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ తో పాటు పలు అల్లోపతి ప్రైవేటు ఆసుపత్రులున్నాయి.

ఆర్ధిక వ్యవస్థసవరించు

ఆంధ్ర ప్రదేశ్లో వర్జీనియా రకం పొగాకు పంటకు ఒంగోలు ఒక ప్రధాన ఉత్పత్తి, వాణిజ్య కేంద్రము. గ్రానైటు గనులకు ప్రసిద్ధి చెందినది.

 
సమావేశ మందిరం, ఒంగోలు

ఒంగోలులోని పెద్ద వ్యాపార సంస్థలు రైతుకుటుంబాలచే స్థాపించబడ్డాయి. పొగాకు కంపెనీలు, పంట, వ్యాపారం బాగా జరుగుతూ వచ్చింది. 1970, 80 దశాబ్దాలలో షూ, పెయింట్, మందులకంపెనీ, పివిసి మొదలైన పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. కానీ వీటిలో చాలావరకు ఆంధ్ర ప్రదేశ్ లోపల వెలుపల ప్రాతాలలోని పోటీకి నిలిచి మనుగడ సాగించడంలో విఫలమయ్యాయి. మానవశక్తి, పెట్టుబడులు, విజయవంతంగా నడపటానికి కావలసిన నాయకత్వం కొరతే దీనికి కారణం. ఎనభై (80), తొభైయవ (90)దశాబ్దంలో నూతన సెకండరీ, ఇంటర్మీడియట్ కళాశాలలు, ఆసుపత్రుల స్థాపనలు అధికమైనాయి. ఒంగోలు విద్యాపరంగా అభివృద్ధిలో ఉన్న ప్రదేశం. ఎనభైయ్యవ (80) దశకంలో ఒంగోలు పశ్చిమ దిశలో గ్రానైట్ నిక్షేపాలు వెలుగు చూడటంతో వ్యాపార పరంగా సరికొత్త అధ్యాయం మొదలైంది.

సంస్కృతిసవరించు

పండుగలుసవరించు

ప్రతి దీపావళికి ముందు నరకాసుర వధ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఈ సాంప్రదాయం 1902 నుంచి కొనసాగుతుండటం విశేషం. నరక చతుర్దశి రోజు అర్ధరాత్రి ఈ ప్రదర్శన మొదలై తెల్లవారు జామున నాలుగు గంటలకు ముగుస్తుంది. ఒంగోలుకే చెందిన శ్రీయువజన మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుగుతాయి. పట్టణంలోని తూర్పుపాలెం నివాసి సింగరాజు సుబ్బయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం మొట్టమొదటి సారిగా ప్రారంభమైంది.[14]

కళారంగంసవరించు

ప్రతీ యేడు ఇక్కడ ఎన్.టి.ఆర్ కళా పరిషత్, ఒంగోలు ఆధ్వర్యంలో జరిగే నాటకోత్సవాలకి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారులు ప్రజలను అలరిస్తారు. ఒంగోలు నుండి ఎంతో మంది ప్రముఖులు నాటక, చిత్ర రంగమందు ప్రిసిద్ధి చెందారు. దిగ్గజ నటులు "కంచు కంఠం"గా పేరొందిన నటుడు కొంగర జగ్గయ్య ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి భారత లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారతీయ కళాకారునిగా కూడా చరిత్రకెక్కారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

 
సాయిబాబ మందిరం, ఒంగోలు
 1. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం, (సంత పేట)
 2. శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం:- 15వ శతాబ్దానికి చెందిన ఒంగోలు రాజు శ్రీ మందపాటి రామచంద్రరాజు, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ఆలయ నిర్మాణం జరిపించారు. ఆయన తన గుర్తుగా, ఈ ఆలయానికి ఒక ఖడ్గాన్ని బహూకరించారు, ఆ ఖడ్గం ఇప్పటికీ ఆలయంలో చెక్కుచెదరకుండా భద్రంగా ఉంది.[15]

ప్రముఖులుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. "Part III, District and Sub-District (Mandals)" (PDF). Census of India. The Registrar General & Census Commissioner, India. pp. 157, 178. Retrieved 27 April 2019.
 2. Edward B. Eastwick (1879). Handbook of the Madras Presidency. John Murray. p. 329.
 3. Imperial Gazetteer of India. Provincial series - Madras. 1908. p. 338.
 4. "Part III, District and Sub-District (Mandals)" (PDF). Census of India. The Registrar General & Census Commissioner, India. pp. 157, 178. Retrieved 27 April 2019.
 5. "Ongole Municipal Corporation". Retrieved 2019-08-04.
 6. "Commissioner Profile". ongolemunicipalcorporation.org. Archived from the original on 4 జూన్ 2016. Retrieved 3 July 2016. Check date values in: |archive-date= (help)
 7. "Bus Stations in Districts". Andhra Pradesh State Road Transport Corporation. Retrieved 8 March 2016.
 8. Krishnamoorthy, Suresh (22 April 2015). "Several bus stations lack CCTV surveillance". The Hindu. Hyderabad. Retrieved 8 March 2016.
 9. "Vijayawada division - A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
 10. "Ongole Airport Site Approved". Hindu Business Line. Retrieved 19 February 2014.
 11. "RIMS College - ONGOLE". Rimsongole.org. Retrieved 2013-09-29.
 12. "QIS College of Engineering & Technology :: Ongole". Qiscet.edu.in. 2013-07-12. Retrieved 2014-03-04.
 13. "Prakasam Engineering College". Prakasamec.com. 2013-04-06. Retrieved 2014-03-04.
 14. ఒంగోలులో నరకాసుర వధ, ఈనాడు ఆదివారం 27, అక్టోబరు 2013
 15. ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,జూన్-25; 1వపేజీ.

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఒంగోలు&oldid=3092269" నుండి వెలికితీశారు