పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళల విద్యాభివృద్ధి కొరకు 1983వ సంవత్సరంలోఎన్.టి. రామారావు ముఖ్య మంత్రిగా వున్నప్పుడు శ్రీ పద్మావతి మహిళా విశ్వ విధ్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసారు. అంత వరకు పద్మావతి మహిళా కళాశాలగా , శ్రీ వేంకటేశ్వరా యూనివివర్సిటి కి అనుబంధమై వుండిన ఈ కళా శాల విశ్వవిద్యాలయంగా మార్పు చెందింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని ఏకైక మహిళా విశ్వ విద్యాలయం. ఇది తిరుపతి జిల్లా ప్రముఖ పట్టణమైన తిరుపతిలో- పవిత్ర తిరుమల కొండ పాదాల చెంత సుమారు 138 ఎకరాల విస్తీర్ణం లో నిర్మించ బడివున్నది. మొదట్లో 10 ఫాకల్టీలతో, 300 మంది విద్యార్థులతో, 25 మంది ఉద్యోగులతో ప్రారంబమైన ఈ విశ్వ విద్యాలయం కాల క్రమేణ ఎంతో అభి వృద్ధి చెందినది.

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము
Sri Padmavati Mahila Visvavidyalayam.jpg
రకంపబ్లిక్
స్థాపితం1983
ఛాన్సలర్బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్
వైస్ ఛాన్సలర్దువ్వూరు జమున
స్థానంతిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారత్
జాలగూడుhttps://www.spmvv.ac.in
Sri Padmavathi Mahila University Entrance
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రవేశం

ఈ విశ్వ విద్యాలయంలోని ఇంజనీరింగు సంబందిత కోర్సులలో ఆంధ్రా ప్రాంతం వారికి 43 శాతం, తెలంగాణా ప్రాంతం వారికి 36 శాతం, రాయల సీమ ప్రాంతం వారికి 22 శాతం కేటాయించ బడ్డాయి. ఈ విశ్వవిద్యాలయం నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ద్వారా నాలుగు నక్షత్రాల గుర్తింపు పొందింది. ప్రొఫెసర్ దువ్వూరు జమున 2020 జనవరిలో వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు[1].

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లంకెలుసవరించు


మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-01-07. Retrieved 2021-11-19.