కొన్ని అక్షరాలకు లేదా ఒక అర్ధవంతమైన పదానికి ఒక అక్షరం లేదా కొన్ని అక్షరాలు లేదా ఒక అర్ధవంతమైన పదాన్ని కలపడంతో మరో అర్ధవంతమైన పదం వచ్చేలా, మొదట తీసుకున్న పదానికే వేరువేరు పదాలను లేదా వేరువేరు అక్షరాలను జోడిస్తే వేరువేరు అర్ధాలు వచ్చేలా మొదటి పదాన్ని ఇరుసు వలె మధ్యలో ఉంచి స్పోక్స్ వలె ఇతర అక్షరాలను లేదా పదాలను చేరుస్తూ రూపొందించే చట్రాన్ని పదచట్రం అంటారు.

ప్రసిద్ధి చెందిన ఒక తెలుగు పద చట్రం (కారము ఎంత ఘాటైనా దానిని చట్రంలో బిగిస్తే వచ్చే పదాలు ఎన్నేన్నో)

కారము ఒక అర్ధవంతమైన పదము, ఈ పదానికి వేరువేరు అక్షరాలను జోడిస్తే వచ్చే వేరువేరు అర్ధవంతమైన పదములను ఈ క్రింద చూడండి.

  • అంగీ + కారము = అంగీకారము
  • అప + కారము = అపకారము
  • అహం + కారము = అహంకారము
  • ఆ + కారము = ఆకారము
  • ఉప + కారము = ఉపకారము
  • ఓం + కారము = ఓంకారము
  • గుణ + కారము = గుణకారము
  • నిరా + కారము = నిరాకారము
  • పరోప + కారము = పరోపకారము
  • ప్ర + కారము = ప్రకారము
  • ప్రా + కారము = ప్రాకారము
  • మమ + కారము = మమకారము
  • వి + కారము = వికారము
  • సా + కారము = సాకారము
  • స్వీ + కారము = స్వీకారము

ఇవి కూడా చూడండి

మార్చు

పద చతురస్రం

"https://te.wikipedia.org/w/index.php?title=పద_చట్రం&oldid=3212972" నుండి వెలికితీశారు