పప్పు సోమేశ్వరరావు
పప్పు సోమేశ్వరరావు వీణా విద్వాంసులు, జ్యోతిష సంస్కృతాలలో ఉద్దండులు.[1] అతను "ఎ" క్లాసు వీణా కళాకారునిగా ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లలో సుమారు 40 సంవత్సరాల పాటు పనిచేసారు.[2]
జీవిత విశేషాలు
మార్చుపప్పు సోమేశ్వరరావు గారు విజయనగరంలో 1934 జనవరి 5న జన్మించాడు.[3] వీరి రాగం,తానం పల్లవి లకు ప్రత్యేకత ఉంది. 100 పల్లవులను విభిన్న తాళాలలో వాయించే అరుదైన నేర్పున్నవారు. పప్పు సోమేశ్వర రావు "కృతి కదంబం" పేరుతో సంస్కృత భాషా కృతులను రాశారు. నవగ్రహాలపై రాసిన కృతులు వీరి సంస్కృత భాషా సంగీత పాండిత్యానికి ప్రతీకలు[4].
ఇఒతను విజయనగర పద్ధతిలో తానం వాయించి ప్రత్యేకత సృష్టించారు. విజయవాడ రేడియోలో 14వ యేట మొదటి కచేరీ చేశారు. ఆయనకు గురువు, స్వయంగా ఆయన బావగారు అయ్యగారి సోమేశ్వరరావు.
అతను ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాద్ సికంద్రాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాలలలో వీణాచార్యులయ్యారు. వైణికునికి పరీక్ష పెట్టె తోడి, ఆనంద భైరవి, శహన, కేదార గౌళ, కాపీ, నీలాంబర రాగాలను సాధికారంగా వాయించే నైపుణ్యం వారిది.
అతను ’’సోమేశ్వర కృతి కదంబం‘’ పేరిట వాగ్గేయ కారుల చరిత్ర రాసి 1997 లో ప్రచురించటమేకాక వాగ్గేయ కారులు కూడా అయ్యారు. ’’కృతి కదంబం‘ ’పేరుతో సంస్కృత భాషా కృతులను రాశారు. నవగ్రహాలపై రాసిన కృతులు వీరి సంస్కృత భాషా సంగీత పాండిత్యానికిప్రాతీకలు.
అతను "వీణానాద సుధార్ణవ", "వైణిక సార్వ భౌమ" బిరుదాంకితులు. 2002 సెప్టెంబరు 12న అతను పరలోక గతులయ్యారు. ఇతని కుమారుడు పప్పు చంద్రశేఖర్ కూడా వీణా విధ్వాంసుడే.[5]
మూలాలు
మార్చు- ↑ "Maestro in his right". The Hindu (in Indian English). 2011-12-22. ISSN 0971-751X. Retrieved 2019-01-15.
- ↑ "Sai Bhavishyavani - K.P. System of Indian Astrology". www.saibhavishyavani.com. Archived from the original on 2018-11-13. Retrieved 2019-01-15.
- ↑ గోపాలకృష్ణీయం-కృష్ణమూర్తి పద్ధతి విశేషాంశాలు - రచన:పి.ఎం.గోపాలాచారి. నెల్లూరు: శ్రీ మహాగణపతి జ్యోతిర్విద్యా పరిశోధనా సంస్థ. 2003. p. 102.
- ↑ gdurgaprasad (2016-08-09). "ఇది విన్నారా కన్నారా ! 17". సరసభారతి ఉయ్యూరు. Retrieved 2019-01-15.
- ↑ "PAPPU CHANDRA SEKHAR VEENA HOME PAGE". pappuveena.tripod.com. Retrieved 2019-01-15.
బయటి లంకెలు
మార్చు- "bhajare he manasa--karnataka devagaandhaari--aditaalam - clipfail.com". www.clipfail.com (in ఇంగ్లీష్). Retrieved 2019-01-15.[permanent dead link]
- "YouTube". www.youtube.com. Retrieved 2019-01-15.
- "Image: SRI. PAPPU SOMESWARA RAO - THODI RAAGAM THAANAM PALLAVI - YouTube". images.google.co.in (in ఇంగ్లీష్). Retrieved 2019-01-15.
- Jayalakshmi Ayyagari, "Vainiaka Siromani" Sri Pappu Someswara Rao Veena.."Santhana Gopalakrishnam" in khamas, retrieved 2019-01-15