పమేలా చౌదరి సింగ్ (ఆంగ్లం: Pamela Bordes; జననం 1961), భారతీయ ఫోటోగ్రాఫర్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె మిస్ ఇండియా 1982 టైటిల్ ను గెలుచుకుంది.[1]

పమేలా బోర్డెస్
జననంపమేలా చౌదరీ సింగ్
1961 (age 62–63)
న్యూ ఢిల్లీ, భారతదేశం
వృత్తిఫోటోగ్రాఫర్, మోడల్

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె తండ్రి మేజర్ మహీందర్ సింగ్ కడియన్ భారత సైన్యం అధికారిగా పనిచేసాడు. ఆమె జైపూర్ మహారాణి గాయత్రి దేవి గర్ల్స్ పబ్లిక్ స్కూల్లో చదివి, ఆ తరువాత సాహిత్యంలో డిగ్రీ అభ్యసించడానికి ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీలో చేరింది. ఆమె 1982లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అదే సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ తరువాత ఆమె ఐరోపాకు వెళ్లి, అక్కడ హెన్రీ బోర్డెస్ ను వివాహం చేసుకుంది.

పమేలా బోర్డెస్ న్యూయార్క్ లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్, అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ పారిస్, న్యూయార్క్ లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఫోటోగ్రఫీ లలో చదువుకుంది.[2] ఆమె 1997లో ఫోటోగ్రఫీని కెరీర్ గా ఎంచుకుంది.[3]

1980ల చివరలో ఆమె ఒక వేశ్యాగృహంలో పనిచేసిందని ఆరోపణలు ఎదురుకుంది.[4][5][6][7]

మూలాలు

మార్చు
  1. "Adnan Khashoggi: The arms dealer, disarmed by Indian bombshell Pamella Bordes". The Economic Times. 15 June 2017.
  2. Khosla, Surabhi. "Shooting what she loves" Archived 7 డిసెంబరు 2008 at the Wayback Machine, the-south-asian.com, May 2004 retrieved 7 October 2008
  3. Vetticad, Anna M. M. (January 1997). "Past all gossips and scandals, Pamela Singh takes up photography". India Today (in ఇంగ్లీష్). Retrieved 20 November 2018.
  4. Roy, Amit (9 October 2005). "A trip down memory lane" Archived 6 జూన్ 2011 at the Wayback Machine The Telegraph (Calcutta) retrieved 14 November 2006.
  5. "Billionaire arms dealer breaks his silence over claims he hired Heather Mills as escort". London Evening Standard. 11 November 2006. Retrieved 14 November 2006.
  6. Tripathi, Salil; Flandrin, Philippe; Jain, Madhu; De Sarkar, Dipankar; Bobb, Dilip; Devadas, David; Karkaria, Amrit (24 October 2013) [Originally published on 15 April 1989]. "Pamella Bordes' sexual escapades with high and mighty rock British establishment". India Today. New Delhi: Living Media. Archived from the original on 10 June 2019. Retrieved 10 June 2019.
  7. Max Clifford and Angela Levin Max Clifford: Read All About it! Virgin Books, 2005,(ISBN 978-1-85227-237-1)