పరకాల మండలం

తెలంగాణ, హన్మకొండ జిల్లా లోని మండలం


పరకాల మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లాకు చెందిన మండలం.[1]

పరకాల మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, పరకాల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, పరకాల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, పరకాల మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°11′59″N 79°42′09″E / 18.199757°N 79.702636°E / 18.199757; 79.702636
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ జిల్లా
మండల కేంద్రం పరకాల
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 73,593
 - పురుషులు 36,615
 - స్త్రీలు 36,978
పిన్‌కోడ్ 506142

ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది.[2][3] ప్రస్తుతం ఈ మండలం పరకాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  11  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 80,542 - పురుషులు 40,084 - స్త్రీలు 40,458. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 154 చ.కి.మీ. కాగా, జనాభా 48,426. జనాభాలో పురుషులు 24,117 కాగా, స్త్రీల సంఖ్య 24,309. మండలంలో 12,281 గృహాలున్నాయి.[4]

విద్యా సౌకర్యాలు మార్చు

భూపాలపల్లి రహదారిపై ఎమ్.ఆర్.రెడ్డి.డిగ్రీ కళాశాల, బస్టాండ్ రోడ్డులో సాహితీ జూనియర్ కళాశాల మరి రెండు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. విద్యారణ్యపురి రహదారిపై ఛైతన్య ఇంగ్లీష్ మీడియం ఉంది.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. పరకాల
  2. కామారెడ్డిపల్లి
  3. నాగారం
  4. పోచారం
  5. మల్లక్‌పేట్
  6. మాదారం
  7. రాజీపేట్
  8. లక్ష్మీపురం
  9. వెంకటాపూర్
  10. వెల్లంపల్లి
  11. పైడిపల్లి

నడికూడ మండలంలో చేరిన గ్రామాలు మార్చు

2018 మార్చిలో నడికూడ మండలం ఏర్పడకు ముందు ఈ మండలంలో 20 గ్రామాలు ఉండేవి. అందులోని నార్లాపూర్, నడికూడ, వరికోల్, రాయపర్తి, పులిగిళ్ల, చర్లపల్లి, ముస్త్యాల్‌పల్లి, చౌటపర్తి, ధర్మారం తొమ్మిది గ్రామాలు కొత్తగా ఏర్పడిన నడికూడ మండలంలో విలీనమయ్యాయి.[5]

మండలంలో దర్శించదగిన దేవాలయాలు మార్చు

పరకాల బస్టాండు కూడలిలో శ్రీకుంకుమేశ్వరస్వామి వారి పురాతన దేవాలయం ఉంది. మల్లక్క పేటలో అతిపెద్ద హనుమాన్ దేవాలయం, వరంగల్ రహదారిపై సాయిబాబా దేవాలయం ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. "తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్". Zee News Telugu. 2018-03-24. Retrieved 2022-01-22.

వెలుపలి లంకెలు మార్చు