ఇతర జంతువులను తిని జీవించే జీవులను పరభక్షకాలు (Predators) అంటారు. పరభక్షకాల కంటే వాటికి ఆహారంగా ఉపయోగపడే జీవులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. పరజీవులను పట్టుకోవడానికి ఉపయోగపడే అవయవాలను పరభక్షకావయవాలు (Raptorial organs) అంటారు. ఇలా జీవులు ఇతర జీవులను చంపి తినడాన్ని పరభక్ష జీవనం (Predation) అంటారు. ఇలా చంపబడే జీవులను భక్షకాలు (Prey) అంటారు.

గద్ద పరభక్ష జీవిగా ఎలుకను చంపి తింటుంది.

మానవుల పరభక్ష జీవనం

మార్చు

ప్రపంచవ్యాప్తంగా మానవులు అన్నింటికన్నా విస్తృతమైన, శక్తివంతమైన, తెలివైన పరభక్షకాలు.[ఇది ఎంతో అవమానకర మైన వాస్తవం]

మానవ మేధస్సుతో వివిధ పరికరాలను ఉపయోగించి వేట (Hunting) ద్వారా జంతువులను, చేపలను చంపి ఆహారంగా తినడం ప్రాచీనకాలం నుండి కొనసాగుతున్నది. కొందరు ఇతర జంతువులను (కుక్క, డేగలు) దీనికోసం ఉపయోగిస్తున్నారు. తన స్వార్ధం కోసం హానికారకాలు కాని గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు మొదలైనవాటిని చంపుతున్నాడు. దీనికోసం భూభాగాన్నంతా, సముద్రజలాల్ని ఉపయోగిస్తున్నాడు.