పరమేశ్వరన్ అయ్యర్
పరమేశ్వరన్ అయ్యర్ (ఆంగ్లం: Parameswaran Iyer) నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO).[1] భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడిన వ్యవస్థ నీతి ఆయోగ్.[2] ఆయన 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2009లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొంది ప్రపంచ బ్యాంకులో చేరారు.[3] అక్కడ వాటర్ గ్లోబల్ ప్రాక్టీస్‌లో వ్యూహాత్మక కార్యక్రమాలకు గ్లోబల్ లీడ్‌గా పనిచేశాడు.[4] 2014లో భారత ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్, దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య ప్రచారానికి నాయకత్వం వహించాడు.[5][6] స్వచ్ఛ్ భారత్ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో పరమేశ్వరన్ అయ్యర్ కృషి ప్రశంసలందుకుంది.[7]
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుశ్రీనగర్లో 1959 ఏప్రిల్ 16న పరమేశ్వరన్ అయ్యర్ జన్మించాడు. అతని తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి.[8] ఆయన డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఆపై ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదివాడు.[9] సెయింట్ స్టీఫెన్స్ కళాశాల విద్యార్థిగా అతను టెన్నిస్‌లో జరిగిన జూనియర్ డేవిస్ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను నార్త్ కరోలినాలోని డేవిడ్‌సన్ కాలేజీలో ఒక సంవత్సరం ఎక్స్ఛేంజ్ స్కాలర్‌షిప్ పొందాడు.[10]
కెరీర్
మార్చు1981లో ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో పరమేశ్వరన్ అయ్యర్ చేరారు. 2009లో ప్రపంచ బ్యాంకులో నీటి వనరుల మేనేజర్‌గా పని చేసేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ప్రపంచ బ్యాంకు విధుల కోసం వియత్నాం, చైనా, ఈజిప్ట్, లెబనాన్, వాషింగ్టన్‌లలో పనిచేశాడు.[11] ఆ తరువాత 2016లో భారత ప్రభుత్వంలోని డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మంత్రిత్వ శాఖలో చేరారు. అతను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో కాలమిస్ట్‌గా ఉన్నారు.[12] అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.
గ్రంథసూచిక
మార్చు- అయ్యర్, పరమేశ్వరన్. మెథడ్ ఇన్ ది మ్యాడ్నెస్. హార్పర్ కోలిన్. ISBN 978-9390327560.[13]
- అయ్యర్, పరమేశ్వరన్ (2019). ది స్వచ్ఛ్ భారత్ రివల్యూషన్: ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ఇండియా బిహేవియరల్ ట్రాన్స్ఫర్మేషన్. హార్పర్ కోలిన్. ISBN 978-9353572679.[14]
మూలం
మార్చుమూలాలు
మార్చు- ↑ "NITI Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్". web.archive.org. 2022-06-25. Archived from the original on 2022-06-25. Retrieved 2022-06-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ DelhiJune 24, India Today Web Desk New; June 24, 2022UPDATED:; Ist, 2022 17:07. "Parameswaran Iyer appointed new CEO of NITI Aayog". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-06-24.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Parameswaran Iyer". World Economic Forum.
- ↑ "Parameswaran Iyer". HarperCollins Publishers India. Retrieved 2022-06-24.
- ↑ Dhingra, Sanya (January 31, 2021). "Parameswaran Iyer, Modi's IAS man for Swachh Bharat, reveals how the mission was achieved".
- ↑ "How Swachh Bharat Mission's Parameswaran Iyer Got His Dream Job". www.news18.com. February 26, 2021.
- ↑ Chitravanshi, Ruchika (July 27, 2020). "Modi's Swachh Bharat man, Param Iyer calls it a day as sanitation secy" – via Business Standard.
- ↑ Bamzai, Kaveree (October 6, 2019). "Modi's favourite Parameswaran Iyer belongs to the cult of super IAS officers like TN Seshan".
- ↑ Raj Chengappa (December 20, 2019). "The Swachh Yogi". India Today.
- ↑ Iyer 2021, p.1
- ↑ "Parameswaran Iyer | Indian Economy". indianeconomy.columbia.edu.
- ↑ "Parameswaran Iyer". October 30, 2019.
- ↑ "Method in the Madness". HarperCollins Publishers India.
- ↑ "The Swachh Bharat Revolution". HarperCollins Publishers India.