బ్రహ్మశ్రీ పరశురామ ఘనాపాఠి కంచి శంకర మఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి వేద పారాయణం చేయించిన గురువు. దేశంలోనే యజుర్వేదాన్ని ఔపోసన పట్టిన వేద పారాయణుడిగా ఖ్యాతినొందిన పరశురామన.. మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌నుంచి ‘పురస్కార్‌’ అవార్డును సైతం అందుకున్నారు.[1]

జీవిత విశేషాలుసవరించు

ఆయన తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని ఇంజికొల్లైలో ఆగష్టు 15 1914 న జన్మించారు.[2] రామేశ్వరం దేవస్థాన పాఠశాలలో వేద అభ్యాసం చేశారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాత వేద సభలన్నింటి చేత సత్కారం పొందిన మహా వేదపండితులు. జయేంద్ర సరస్వతి ఆయనకు మొదటి శిష్యులు. తిరువానైక్కావల్‌లోని వేదపాఠశాలలో జయేంద్ర సరస్వతికి వేదపఠనం చేయించారు. కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతికి వేదం నేర్పించారు. చెన్నై శివారులోని అంబత్తూరులో పరశురామ ఘనాపాఠి నివసించారు.

ఆయన భారత రాష్ట్రపతి నుండి "పురస్కార్" అవార్డును పొందారు. ఆయన తన 102వ యేట కూడా వేదాలు, శాస్త్రాలను బోధించేవారు. అయనకు "కలియుగ యజ్ఞవల్క" అవార్డు కూడా లభించింది. ఈ పురస్కారాన్ని కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా అందుకున్నారు. యివే కాకుండా ఆయననిఉ భగవత్ సేవారత్న, గురుసేవా రత్న, జన సేవారత్న, ప్రథమ ఆచార్య రత్న, విద్యా సహాయరత్న, పరిహార జోతిడ శిఖామణి అవార్డులు కూడా వచ్చాయి.[3]

వ్యక్తిగత జీవితంసవరించు

ఆయనకు ఐదుగురు సంతానం. ఆయన జనవరి 21 2016 న తన 103వ యేట స్వర్గస్థులైనారు.

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు