పరావర్తనం ద్వారా ధ్రువణం
ఒక నిర్దిష్ట పతనకోణం іpతో ఒక పారదర్శక పదార్ధతలం పై సాధారణ కాంతి పుంజాన్ని పతనంచేసి ధ్రువితకాంతిని పొందవచ్చు. పరావర్తనం చెందిన కాంతి పుంజం సంపూర్ణంగా (పతనతలంలో) ధ్రువణం చెంది ఉంటుంది.[1] ఒక తలం నుండి పరావర్తనం చెందిన సాధారణ కాంతి (అధ్రువిత కాంతి) పుంజం పాక్షికంగా కాని సంపూర్ణంగా కాని ధ్రువణం చెందుతుందని Ε. లూయీ మాలస్ కనుక్కొన్నాడు. సాధారణ లేదా అధ్రువిత కాంతిని సమానతీవ్రతలు గలిగి పరస్పరం లంబతలాలలో ధ్రువణం చెంది ఉన్న రెండు అసంబద్ధ విద్యుదయస్కాంత తరంగాల అధ్యారోపణ ఫలితం అని భావించవచ్చు. అందువల్ల అధ్రువిత కాంతి యొక్క Ε సదిశను పతన తలానికి (і) లంబంగాను (іі) సమాంతరంగానూ ఉండే రెండు అంశాలుగా విభజించవచ్చు. ఈ రెండు సమతల ధ్రువిత కాంతి అంశాలను బిందువులు, జంటబాణం గుర్తులతో సూచిస్తారు. పటతలానికి లంబదిశలో కంపించే Е సదిశలుగల సమతల ధ్రువితకాంతిని బిందువులచేతా, పటతలానికి సమాంతరంగా కంపించే Е సదిశగల, సమతల ధ్రువిత కాంతిని జంటబాణం గుర్తులతో సూచిస్తారు. సాధారణ కాంతిని (అధ్రువిత కాంతి) బిందు, జంటబాణం గుర్తులతో రెండింటినీ ఏకకాలంలో వాడుతూ సూచిస్తారు. ఒక అధ్రువిత కాంతి పుంజం АВ ఒక గాజు తలం పై పతనం చెందుతున్నది. ఈ పుంజం బిందు, బాణం అంశాలు రెండింటినీ కలిగి ఉంది. ВС పరావర్తనం చెందిన కిరణ పుంజం, ఈబ్ పుంజంలో పతన తలానికి లంబంగా ఉన్న కంపన తలంగల కాంతి తరంగాలు (అన్నీ బిందు అంశాలు గలవి) మాత్రమే ఉన్నాయి. అలా పరావర్తనం చెందిన కాంతి సమతల ధ్రువణం చెందినదై ఉంటుంది. దీన్ని ఒక టూర్మలీన్ స్ఫటికంతో పరీక్షించవచ్చు. పరావర్తనం చెందిన కాంతి పుంజం ఎంత మొత్తంలో ధ్రువణం చెందేదీ పతన కోణం і పై అధారపడి ఉంటుంది. ఒక నిర్ధిష్ట పతనకోణం іpవిలువకు పరావర్తనం చెందిన కాంతి పుంజం సంపూర్ణంగా - పతన తలానికి లంబతలంలో కంపనతలం ఉండేట్లు అంటే బాణం అంశాలేవీ లేకుండా, కేవలం బిందు అంశాలు మాత్రమే ఉండేట్లుగా - ధ్రువణం చెందుతుంది. ఈ కోణం іp ని ధ్రువణకోణం అంటారు. ఈ ధ్రువణకోణాన్ని బ్రూస్టర్ కోణమని కూడా అంటారు. ఈ కోణం іp విలువకు పరావర్తన కిరణ పుంజం, వక్రీభవనకిరణ పుంజాలు పరస్పరం లంబంగా ఉంటాయి. కాంతి పుంజం పతనమైన పారదర్శక యానకం యొక్క వక్రీభవనగుణకం μ, ధ్రువణ కోణం іpతో
- μ=tan іp
సంబంధాన్ని కలిగి ఉంటుంది. మామూలుగాజుకు విలువ ఉంటుంది. వక్రీభవనం చెందిన కిరణ పుంజం ВD లో పతన తలానికి సమాంతరంగా ఉన్న కంపనతలంగల అన్ని తరంగాలు, పతన తలానికి లంబతలంలోఉన్న కంపన తలంగల తరంగాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ వక్రీభవనం చెందిన కాంతి పుంజం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది కానీ, అది పాక్షికంగా ధ్రువణం చెందినదై ఉంటుంది.
ఇవి కూడా చూడుము
మార్చు- పరావర్తనం
- వివర్తనం విశదీకరణ
మూలాలు
మార్చు- ↑ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం భౌతికశాస్త్రం