పరిగి మండలం (వికారాబాదు జిల్లా)

తెలంగాణ, వికారాబాదు జిల్లా లోని మండలం

పరిగి మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] పరిగి, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వికారాబాద్ నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.వికారాబాదు రెవెన్యూ డివిజన్‌లో ఈ మండలం భాగంగా ఉంది. హైదరాబాదు నుంచి కర్ణాటకలోని బీజాపుర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి ఈ మండలం గుండా వెళుతుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది చేవెళ్ళ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  37  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

పరిగి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, పరిగి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, పరిగి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°11′00″N 77°53′00″E / 17.1833°N 77.8833°E / 17.1833; 77.8833
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం పరిగి (వికారాబాదు)
గ్రామాలు 35
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 62,984
 - పురుషులు 31,420
 - స్త్రీలు 31,564
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.83%
 - పురుషులు 64.45%
 - స్త్రీలు 41.23%
పిన్‌కోడ్ {{{pincode}}}

గణాంకవివరాలుసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

మండల జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 62,984 - పురుషులు 31,420 - స్త్రీలు 31,564. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ కలగలేదు. మండల వైశాల్యం 226 చ.కి.మీ. కాగా, జనాభా 62,984. జనాభాలో పురుషులు 31,420 కాగా, స్త్రీల సంఖ్య 31,564. మండలంలో 13,343 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలుసవరించు

ఉత్తరం: పూడూరు, దక్షిణం: దోమ, ఉత్తరం: వికారాబాద్, పడమర: బొమ్మరాసు పేట

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 248, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులుసవరించు