వికారాబాద్
వికారాబాద్, తెలంగాణ రాష్ట్రములోని వికారాబాదు జిల్లా, వికారాబాద్ మండలానికి చెందిన పట్టణం.[1] 1987లో వికారాబాదు పురపాలకసంఘంగా ఏర్పడింది.
వికారాబాద్ | |
— పట్టణం — | |
అనంత పద్మనాభస్వామి దేవాలయం | |
అక్షాంశరేఖాంశాలు: 17°20′12″N 77°54′17″E / 17.336675784544482°N 77.90473948771782°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండలం | వికారాబాద్ |
ప్రభుత్వం | |
- పురపాలక సంఘం | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇది హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు రోడ్డు, రైలుమార్గంలో ఈ పట్టణం ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కి.మీ. దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కి.మీ. దూరంలో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి కర్ణాటకలోని వాడి మార్గంలో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా మహారాష్ట్రలోని పర్బనికి రైలుమార్గం ఉంది.
చరిత్ర
మార్చుఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా స్వంత జాగీరు అవడంవల్ల ఈ జాగీరుకు వికారాబాద్ అని పేరు వచ్చింది.[3][4]
కలక్టరేట్ భవన ప్రారంభం
మార్చు35 ఎకరాల విస్తీర్ణంలో 60.7 కోట్ల రూపాయలతో జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 2022, ఆగస్టు 16న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. అనంతరం 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్న మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు-భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, చేవెళ్ళ ఎంపీ జి. రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5][6][7]
రవాణా సౌకర్యాలు
మార్చుప్రధాన రైల్వేస్టేషన్: హైదరాబాదు 68 కి.మీ.పశ్చిమ రంగారెడ్డి నడిభాగాన ఉండుటచే రవాణా పరంగా మంచి కూడలిగా ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాదు నుండి వాడి మార్గాన ఉన్న రైల్వే స్టేషను, రైల్వేజంక్షన్ ఇది. బస్సు రోడ్డు మార్గంలో హైదరాబాదు నుంచి తాండూరు వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. సదుపాయాలు కూడా బాగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు డిపో కూడా పట్టణంలో ఉంది.ఇక్కడి నుండి చేవెళ్ల, తాండూరు, పరిగి, సదాశివపేట, శంకరపల్లి వంటి పట్టణాలకు చాల బస్సులు నడుస్తున్నాయి.
పురపాలక సంఘం
మార్చుపట్టణంలో పురపాలక సంఘాన్ని1987లో ఏర్పాటు చేశారు. అంతకు క్రితం గ్రామపంచాయతిచే పాలన కొనసాగేది. పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పరిసర గ్రామాలైన ఎన్నెపల్లి, శివారెడ్డి పేట్, కొత్రెపల్లి, అనంతగిరిపల్లి, వెంకటాపూర్ తండాలను పట్టణంలో కలిపివేశారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు పురపాలక సంఘాలలో ఇది ఒకటి. పురపాలక సంఘ కార్యాలయం రైల్వేస్టేషనుకు అతిసమీపంలో ఉంది.
పట్టణంలోని కాలనీలు
మార్చు- రామయ్యగూడ: ఇది వికారాబాద్ పట్టణంలోని ఒక కాలని. ఇక్కడి ప్రజలంతా చిల్లర వ్యాపారాలు చేసుకుంటూ జీవితాలు వెళ్ళదీసుకుంటారు.
- ఎన్నెపల్లి: ఒకప్పుడు ప్రత్యేక గ్రామంగా ఉన్న ఎన్నెపల్లి ఇప్పుడు పూర్తిగా వికారాబాద్ పట్టణంలో కలిసింది. వికారాబాదులో ముఖ్యమైన కాలనీలలో ఒకటి.
- వేంకటేశ్వర కాలని: ఇది వికారాబాద్ పట్టణంలోని ఒక కాలనీ. ఇక్కడి ప్రజలంతా విద్యావంతులు, ఉపాధ్యాయులు,వ్యాపారస్తులు. ఇది ఆదర్శ కాలని. ఇక్కడ వేంకటేశ్వర ఆలయం ఉంది.
ప్రభుత్వ వైద్య కళాశాల
మార్చువికారాబాదు పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం 2023లో వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటుచేసింది. 2023 సెస్టెంబరు 15న ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు.[8][9]
విద్యాసంస్థలు
మార్చు- ప్రాథమిక పాఠశాలలు[10]
- ప్రభుత్వ పాఠశాలలు: 2,
- మండల పరిషత్తు పాఠశాలలు: 43,
- ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు: 3,
- ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలలు: 10
- ప్రాథమికోన్నత పాఠశాలలు[11]
- మండలపరిషత్తు పాఠశాలలు: 7
- ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలలు: 8
- ఉన్నత పాఠశాలలు[12]
- ప్రభుత్వ పాఠశాలలు: 3
- మండల పరిషత్తు పాఠశాలలు: 15
- ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు: 3
- ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలలు: 11
- కళాశాలలు
- శ్రీ అనంత పద్మనాభ కళాశాల, వికారాబాదు
- శ్రీ సరస్వతి విద్యాలయ కళాశాల, వికారాబాదు
- విద్యాసాగర్ డిగ్రీకళాశాల, వికారాబాదు
సమీప పర్యాటక ప్రదేశాలు
మార్చు- మృగవని చిలుకూరు జింకల పార్కు (15 కి.మీ.)
- మూసీనది జన్మస్థానమైన అనంతగిరి కొండలు:హైదరాబాదుకు 72 కిలోమీటర్ల దూరంలో వికారాబాదు పరిధిలో 4 కి.మీ. దూరంలో తాండూర్ వెళ్ళుమార్గంలో ఉన్న ఎత్తయిన కొండ ప్రాంతమే అనంతగిరి కొండలు. ప్రకృతి రమణీయతకు ఈ కొండలు పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. కొండపై టి.బి.ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడి వాతావరణం రోగులకు వరదాయకమని ఇక్కడివారి నమ్మకం. కొండపై ఉన్న అపురూపమైన దృశ్యాల కారణంగా అనేక సినిమా షూటింగులు జరిగాయి.
- అనంత పద్మనాభస్వామి దేవాలయం (4 కి.మీ.)
- చిలుకూరు బాలాజీ దేవాలయం (23 కి.మీ.)
- ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ (18 కి.మీ.)
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-03-25.
- ↑ "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-27 suggested (help) - ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (5 June 2016). "భగ్నహృదయాల మేడ - వికార్ మంజిల్". పరవస్తు లోకేశ్వర్. Archived from the original on 3 May 2019. Retrieved 3 May 2019.
- ↑ నమస్తే తెలంగాణ, ఆదివారం. "మార్కండేయుడి తపోవనం వికారాబాద్!". బక్క బాబూరావు. Archived from the original on 3 May 2019. Retrieved 3 May 2019.
- ↑ "CM Kcr: దుష్ట శక్తులకు బుద్ధి చెప్పాలి: వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్". EENADU. 2022-08-16. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-16.
- ↑ telugu, NT News (2022-08-16). "వికారాబాద్‌కు ప్రత్యేక చరిత్ర ఉంది : సీఎం కేసీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-16.
- ↑ telugu, NT News (2022-08-16). "వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-16.
- ↑ "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-27.
- ↑ telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం.. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-27.
- ↑ Hand Book of Statistics - 2007-08, Ranga Reddy Dist, Published by CPO, Page No.153
- ↑ Hand Book of Statistics - 2007-08, Ranga Reddy Dist, Published by CPO, Page No.155
- ↑ Hand Book of Statistics - 2007-08, Ranga Reddy Dist, Published by CPO, Page No.157