పరిగి మండలం (వికారాబాదు జిల్లా)
పరిగి మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] పరిగి, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వికారాబాద్ నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.వికారాబాదు రెవెన్యూ డివిజన్‌లో ఈ మండలం భాగంగా ఉంది. హైదరాబాదు నుంచి కర్ణాటకలోని బీజాపుర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి ఈ మండలం గుండా వెళుతుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది చేవెళ్ళ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 37 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
పరిగి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, పరిగి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°11′00″N 77°53′00″E / 17.1833°N 77.8833°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండల కేంద్రం | పరిగి (వికారాబాదు) |
గ్రామాలు | 35 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 62,984 |
- పురుషులు | 31,420 |
- స్త్రీలు | 31,564 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.83% |
- పురుషులు | 64.45% |
- స్త్రీలు | 41.23% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
గణాంకవివరాలు
మార్చుమండల జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 62,984 - పురుషులు 31,420 - స్త్రీలు 31,564. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ కలగలేదు. మండల వైశాల్యం 226 చ.కి.మీ. కాగా, జనాభా 62,984. జనాభాలో పురుషులు 31,420 కాగా, స్త్రీల సంఖ్య 31,564. మండలంలో 13,343 గృహాలున్నాయి.[3]
సమీప మండలాలు
మార్చుఉత్తరం: పూడూరు, దక్షిణం: దోమ, ఉత్తరం: వికారాబాద్, పడమర: బొమ్మరాసు పేట
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చు- బాబాపౌర్
- బర్కత్‌పల్లి
- బసిరెడ్డిపల్లి
- చిగ్రాల్పల్లి
- చిట్యాల్
- గడ్‌సింగాపూర్
- గోవిందాపూర్
- హీరాపూర్
- ఇబ్రహీంపూర్
- జాఫర్‌పల్లి
- కద్లాపూర్
- ఖుదావాన్పూర్
- లఖనాపూర్
- మాదారం
- మల్కాయిపేట్
- మిట్టకోడూర్
- నారాయణ్‌పూర్
- నస్కల్
- నజీరాబాద్
- పరిగి
- రూప్‌ఖాన్‌పేట్
- రాఘవాపూర్
- రాంరెడ్డిపల్లి
- రంగంపల్లి
- రంగాపూర్
- రాపోల్
- రావల్‌పల్లి
- రుకుంపల్లి
- షాకాపూర్
- సొందేపూర్
- సుల్తాన్పూర్ (పరిగి)
- సయ్యద్‌మల్కాపూర్
- సయ్యద్‌పల్లి
- తొండపల్లి
- యాబాజీగూడ
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 248, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.