పరిణయం 2021లో విడుదలైన తెలుగు సినిమా. మలయాళంలో 2020లో విడుదలైన ‘వరనే అవశ్యముంద్’ సినిమాను తెలుగులో పరిణయం పేరుతో అనువాదం చేశారు.వేఫారెర్ ఫిలిమ్స్, ఎం స్టార్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాకు అనూప్ సత్యన్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, కల్యాణి ప్రియదర్శన్‌, సురేశ్‌గోపి, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 సెప్టెంబర్ నుండి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యింది.[1]

పరిణయం
దర్శకత్వంఅనూప్ సత్యన్
రచనఅనూప్ సత్యన్
దీనిపై ఆధారితంవరనే అవశ్యముంద్ (మలయాళం సినిమా)
నిర్మాతదుల్కర్ సల్మాన్
తారాగణందుల్కర్ సల్మాన్, కల్యాణి ప్రియదర్శన్‌, సురేశ్‌గోపి, శోభన
ఛాయాగ్రహణంముఖేష్ మురళీధరన్
కూర్పుటోబి జాన్
సంగీతంఅల్ఫాన్స్‌ జోసెఫ్‌
నిర్మాణ
సంస్థలు
వేఫారెర్ ఫిలిమ్స్ , ఎం స్టార్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
2021 సెప్టెంబరు 24
దేశం భారతదేశం
భాషతెలుగు

నీనా (శోభన) ఓ ఫ్రెంచ్ ట్యూట‌ర్‌. సింగిల్ పేరెంట్, కూతురు నికిత (కళ్యాణి ప్రియదర్శన్) తో కలిసి జీవనాధారంగా కోసం ఫ్రెంచ్ ట్యూషన్స్ , క్లాసికల్ డ్యాన్స్ క్లాసెస్ తీసుకుంటుంది. నికితాకు సరైన వ‌రుడిని వెతక‌డంలో నీనా బిజీగా ఉన్న స‌మయాన, ఆమెకు త‌న ప‌క్కింటిలో ఉండే మేజ‌ర్ చిన్నికృష్ణ (సురేశ్ గోపీ) తో అనుబంధం ఏర్ప‌డుతుంది. ఈ విషయం తెలిసిన నికిత తన తల్లిపై అయిష్టంగాపెరుగుతుంది. ఈ క్రమంలో ఆమె బిబీష్ (దుల్కర్ సల్మాన్) తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. మ‌రి నీనా పెళ్లి విష‌యంలో మ‌రో నిర్ణ‌యం తీసుకుంటుందా ? మ‌రి కుమార్తె నికితా నుంచి ఆమె పెళ్లికి అంగీకారం దొరుకుతుందా? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: వేఫారెర్ ఫిలిమ్స్ , ఎం.స్టార్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: దుల్కర్ సల్మాన్
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: అనూప్ సత్యన్
  • సంగీతం: అల్ఫాన్స్‌ జోసెఫ్‌
  • సినిమాటోగ్రఫీ: ముఖేష్ మురళీధరన్

మూలాలు

మార్చు
  1. Eenadu (18 September 2021). "దుల్కర్‌, కల్యాణిల ఫీల్‌గుడ్ మలయాళ మూవీ 'ఆహా'లో!". Archived from the original on 28 సెప్టెంబరు 2021. Retrieved 28 September 2021.
  2. NTV (26 September 2021). "రివ్యూ: పరిణయం (మలయాళ డబ్బింగ్)". Archived from the original on 28 సెప్టెంబరు 2021. Retrieved 28 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=పరిణయం&oldid=3798477" నుండి వెలికితీశారు