పరిణీతా దండేకర్

నదుల పరిరక్షణ ఉద్యమకారిణి

పరిణీతా దండేకర్ నదుల పరిరక్షణ ఉద్యమకారిణి. నదుల నిర్వహణ, పునరుద్ధరణ, నదుల పరిరక్షణ రంగాల్లో ఆమె విశేష కృషి చేస్తున్నారు. ఆమె చేసిన కృషికి 2018లో యాక్టివిస్టుల కేటగిరీలో బహూకరించే ప్రతిష్ఠాత్మకమైన ‘వసుంధర’ అవార్డు లభించింది.[1]

పరిణీతా దండేకర్

జీవిత విశేషాలు మార్చు

ఆమె ‘ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌’లో డిప్లొమా చేశారు. ‘ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్’లో పట్టా తీసుకోవడమేగాక పలు ఫెలోషి్‌పలు చేశారు. వాటిల్లో ప్రతిష్ఠాత్మకమైన ‘జోక్‌ వాలర్‌ హంటర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ లీడర్‌షిప్‌ ఫెలోషిప్‌’ ఒకటి. ఆమెకు పిన్నవయసులోనే నదులన్నా, పర్యావరణం, జీవావరణలన్నా ఆమెకు విపరీతమైన ఇష్టం. ఆమెకు నదులపై యిష్టం ఆమె నాన్న వలల అలవడింది. వయసు పెరిగే కొద్దీ నదులపై ప్రేమ మరింత పెరిగింది. అలా చిన్నతనంలోనే నదుల పరిరక్షణపై పనిచేయాలనుకున్నారమె. పరిణీతకు పర్యావరణం, నీరు, జీవావరణం, కమ్యూనిటీ అంశాలతో పాటు సమాన నీటి నిర్వహణ రంగమంటే కూడా ఎంతో ఇష్టం. విస్తృత అధ్యయనాల ద్వారా నదులు, జలవనరుల నిర్వహణపై ఎన్నో సృజనాత్మకమైన ఆలోచనలను, ప్రణాళికలను పరిణీత సూచించారు.[2]

ఉద్యమకారిణిగా మార్చు

ఆమె ప్రస్తుతం ‘సౌత్‌ ‘ఏసియా నెట్‌వర్క్‌ ఆన్‌ డామ్స్‌, రివర్స్‌ అండ్‌ పీపుల్‌’ స్వచ్ఛంద సంస్థకు అసోసియేట్‌ కో-ఆర్డినేటర్‌. ‘ఏసియా నెట్‌వర్క్‌ ఆన్‌ డామ్స్‌, రివర్స్‌ అండ్‌ పీపుల్‌’ స్వచ్ఛంద సంస్థ అసోసియేట్‌ డైరెక్టర్‌గా నదులు, నీటివనరులు, జీవావరణం, పర్యావరణం వంటి అంశాలపై విస్తృతంగా అధ్యయనాలు చేపట్టారు.[3] నదుల ఉనికి, నదీతీరాల్లో నివసించే కమ్యూనిటీ ప్రజల కోసం, పర్యావరణం పరిరక్షణ కోసం ఉద్యమస్ఫూర్తితో పనిచేస్తున్నారు. కమ్యూనిటీల నాయకత్వంలో నీటి నిర్వహణ వల్ల ఒనగూడే లాభాలు ఎన్నో ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేశారామె. రాష్ట్రంలోను, జాతీయస్థాయిలోను జలవనరుల నిర్వహణ, నదుల నిర్వహణ, పునరుద్ధరణ ప్రయోజనాలపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. జెడబ్ల్యుహెచ్‌ గ్రాంటుతో పరిణీత ‘శాస్త్రి’ నదిపై, స్థానిక కమ్యూనిటీల గురించి లోతైన పరిశోధన చేశారు. ముఖ్యంగా గల గల పారే ‘శాస్త్రి’ నదిని ఆవరించి ఉన్న జీవావరణం, నీటి శక్తి గురించిన మూలాలపై సునిశితమైన అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ‘పర్యావరణ మంత్రిత్వ శాఖ’ కుసైతం ఎంతో ఉపయోగపడుతోంది. దాంతో దీర్ఘకాలిక జీవావరణ క్రమంపై పరిశోధన చేపట్టాల్సిందిగా ప్రభుత్వం నుంచి పరిణీతకు పిలుపు వచ్చింది. నదులు, ఆ ప్రాంత కమ్యూనిటీల పరిరక్షణే ధ్యేయంగా భవిష్యత్తులో తన కృషి కొనసాగుతుందని పరిణీత వెల్లడించారు.[4]

మూలాలు మార్చు

  1. "'We lack a system to monitor groundwater usage,' says activist Parineeta Dandekar". 2018-01-07. Retrieved 2018-01-23.
  2. inTOWN, Tineke. "JWH Initiative". JWHinitiative. Archived from the original on 2017-09-04. Retrieved 2018-01-23.
  3. Journal, The Outdoor (2016-09-24). "Our Rivers Are Dying and We Need to Act". TOJ India Edition. Retrieved 2018-01-23.
  4. "ప్రవహించే నది ఆమె... -". www.andhrajyothy.com. Retrieved 2018-01-23.[permanent dead link]

ఇతర లింకులు మార్చు