మందు లేదా ఔషధము (ఆంగ్లం Medicine or Drug) అనగా వ్యాధిని నయం చేయడానికి గాని నిరోధించడానికి గాని ఇవ్వబడే పదార్థం. మందులు అనేకము. ఆయుర్వేదం మందులు, మూలికా మందులు, అల్లోపతి మందులు, హోమియోపతి మందులు, యునానీ మందులు, సిద్ధ మందులుగా అనేక రకాలు ఉన్నాయి. ఒక్కక్క వ్యాధికి ఒక్కొక్క విధానము బాగా పనిచేయును. నేటి సమాజములో అత్యవసర పరిస్థితులలో అల్లోపతి విధానము లోని మందులే ఎక్కువగా వాడుతున్నారు.

భాషా విశేషాలుసవరించు

తెలుగు భాషలో మందు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] మందు నామవాచకంగా Medicine, physic, a drug. ఔషధము అని అర్ధము. A love powder, వశ్యౌషధము. An antidote, ప్రతిక్రియ. An expedient, ఉపాయము. దీనికొక మందు చెప్పెదను I will tell you a device for this. Poison, విషము. Gunpowder, తుపాకి మందు. A rarity, a scarce thing. ఇంట్లో బియ్యము మందుకైనా లేవు there is no rice to be had for love or money. మంచివానికి మాట్లాడనిదే మందు if you are silent towards a good man it is a punishment to him. నీలిమందు indigo. నల్లమందు opium. మందుభాయీ or నల్లమందుభాయీ an opium eater. వలపుమందు or పెట్టుమందు love powder. మందుకాటుక eye salve. మందుపెట్టు to drug, to infatuate a person by administering to him or her a love powder, to poison. మనోవ్యాధికి మందు లేదు there is no cure for the heart-ache. దాని మందు వాని తలకెక్కినది the love powder administered by her has turned his head. adj. Impossible, దుర్లభము. "కూడుదానగల్గెనేని కూరగుటమందు." మందుపట్టడ n. A place where fireworks are prepared. బాణసంచా చేసెడు శాల. మందుమల n. A hill on which drugs are found, an epithet applied to a hill called ద్రోణము. మందులమారి n. One who administers love powders. మందాకు n. A medicinal herb. ఓషధి. "కోటబంగారుగా జేయుకొరుకుమున్ను బ్రహ్మపిడిచిన మందాకు పసరవంగ." మందులవాడు n. A druggist

'జన్‌ ఔషధీ మందులుసవరించు

మందు ఒకటే... బ్రాండ్లు వేలు:మందుల కంపెనీల ప్రతినిధులు డాక్టర్లకు మందుల గురించి పరిచయం చేస్తుంటారు. నిజానికి అవేమీ కొత్త మందులు కాదు.ఉన్న మందుల్నే రకరకాల కంపెనీల వాళ్లు రకరకాల పేర్లతో వాటిని తయారు చేస్తారు.మనకు 375 మందులు చాలని 'హథీ' కమిషన్‌ మూడున్నర దశాబ్దాల కిందట తేల్చి చెప్పింది. అయితే ఇపుడు రకరకాల రూపంలో మొత్తం 75 వేల బ్రాండ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మందుల కంపెనీల మాయాజాలానికి చిక్కకుండా మందులను వాటి అసలు ధరలకు అందించేందుకు బ్రాండ్లతో సంబంధం లేకుండా అసలు మందునే చౌక ధరకు అందించేవే 'జన్‌ ఔషధీ' షాపులు.అతి తక్కువ ధరకు నాణ్యమైన మందులను సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫార్మాస్యూటికల్‌ విభాగం 'జన్‌ ఔషధీ'ల బాధ్యతను తీసుకుంది.ప్రభుత్వ రంగ ఔషధ తయారీ సంస్థల నుంచి మాత్రమే జన్‌ఔషధీలు మందులను కొనుగోలు చేస్తాయి.

నకిలీ మందులుసవరించు

 • ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే నకిలీ మందుల్లో 35 శాతం భారత దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి.- ప్రపంచ ఆరోగ్య సంస్థ
 • దేశంలో నకిలీ మందుల అమ్మకం ఏటా 25 శాతం వృద్ధి చెందుతోంది.- అసోచామ్‌
 • మార్కెట్లో ఉన్న మందుల్లో 8 శాతం అనుమానించ తగినవి-- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

మన రాష్ట్రంలో 51 వేలకు పైగా మందుల దుకాణాలు, 1791 తయారీ సంస్థలు ఉన్నాయి. వీటిని తనిఖీ చేయడానికి ప్రతీ 100 మందుల దుకాణాలకు ఒకరు చొప్పున 510 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు కావాలి. ప్రతీ 25 మందుల తయారీ సంస్థలపై ఒక ఇన్‌స్పెక్టర్‌ చొప్పున మరో 72 మంది ప్రత్యేక నిఘా అధికారులు అవసరం. మొత్తం 582 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు అవసరం కాగా పనిచేస్తున్నది కేవలం 46 మంది. ఔషధాలపై పరిశోధనలు చేసే సంస్థలకు అనుబంధంగా నాణ్యత పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.ఔషధ నియంత్రణ శాఖలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరికరాలు, సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బందిని అందుబాటులో ఉంచాలి.

ఆయుర్వేద మందులుసవరించు

 • మహాకనకసింధూరరసం - ఈ మందుని క్షయ, శ్వాసకోశ వ్యాధులకు వాడతారు.
 • సిద్ధమకరధ్వజం
 • పూర్ణచంద్రోదయం
 • త్రైలోక్యచింతామణి - గుణము: రసాయనము, హ్రుద్యము, క్షయ, పాందు రోగ హరము. మోతాదు : 2 నుండి 4 మాత్రలు. వాడు విధానము : రోజుకు 2 లేక 3 సార్లు తేనెతో భోజనమునకు అర గంట ముందు లేక వెనుక ఇవ్వవలెను.
 • మహాలక్ష్మీవిలాసరసం
 • స్వర్ణసూర్యావర్తి
 • కనకలోహచింతామణి
 • కనకబాలసూర్యోదయం
 • రాజశిరోభూషణం
 • రసచింతామణి
 • విషమజ్వరాంతకలోహం
 • స్వర్ణకాంతవల్లభరసం
 • రజతరసాయనం
 • అష్టలోహపూర్ణచంద్రోదయం
 • కాంతవల్లభరసం
 • వైక్రాంతచంద్రోదయం
 • రజతచంద్రోదయం
 • రజతలోహరసాయనం
 • చతుర్లోహరసాయనం
 • వ్యాధిహరణరసం
 • దివ్యసింధూరం
 • వాతరాక్షసం
 • వంటబాలసూర్యోదయం
 • కఫకేసరి
 • ప్రవాళచంద్రోదయం
 • శ్లేష్మగజాంకుశం
 • స్వర్ణవంగం
 • రసరాట్టు
 • షడ్గుణసింధూరం
 • వసంతకుసుమాకరం - ఈ మందు మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా వుపయోగకరము. వీరికి ఇది ముందు జాగ్రత్త మందుగా దీనిని చెప్పవచ్చు; అనగా రాబోవు శారీరక ఇబ్బందులను ఆపటం గాని లేక త్వరగా రాకుండా గాని చేయును. ఇంకా రక్త వాంతులు, కాళ్ల మంటలకు బాగుగ పనిచెయును. వాడబడే వస్తువులు: స్వర్ణ భస్మం, వంగ భస్మం, నాగ భస్మం, కాన్థసిందూరంమ్, అబ్రక భస్మం, రస సిన్ధూరం మొదలైనవి. మోతాదు: రోజూ ఒక మాత్ర. అనుపానము, మొతాదు రోగ లక్షణముల ననుసరించి మారును.

హోమియోపతి మందులుసవరించు

కముకుదెబ్బలకు : ఆర్నిక
ఎముకలు గాయపడినపుడు : సింఫైటం
నరములు గాయపడినప్పుడు : హైపెరికం
కుడివైపు బాధలకు : లైకోపొడియం
ఎడమవైపు బాధలకు : లేకసిస్

అల్లోపతీ మందులుసవరించు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన అవసరమైన మందుల (Essential Medicines) జాబితా నుండి కొన్ని మందులు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

సర్వ ఔషధ సమాచారం

"https://te.wikipedia.org/w/index.php?title=మందు&oldid=2964816" నుండి వెలికితీశారు