పరుచూరి విజయ ప్రవీణ

పరుచూరి విజయ ప్రవీణ తెలుగు సినిమా నటి, నిర్మాత. కేరాఫ్ కంచరపాలెం సినిమాను నిర్మించడమేకాకుండా అందులోని ఒక ప్రధానపాత్రలో నటించింది.[1]

పరుచూరి విజయ ప్రవీణ
జననం
వృత్తికార్డియాలజిస్ట్ , నిర్మాత

జీవిత విశేషాలు

మార్చు

ఆమె ప్రవాసభారతీయురాలు, న్యూయార్క్ లో సెయింట్ జార్జ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ లో వైద్యవిద్యనభ్యసించి కార్డియాలజిస్టుగా ఉంది. ఆమె తల్లిదండ్రులు తెలుగు భాష నేపథ్యం కలవారు. చిన్నతనంలో తెలుగు చిత్రాల పట్ల ఆకర్షితురాలై ఫిల్మ్‌ స్కూలులో చేరింది.[2] ఆమె తన స్నేహితురాలిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు దర్శకుడు వెంకటేష్ మహాతో మొదలైన పరిచయం కథ వినడంతో ఆగలేదు ఏకంగా సినిమా తీసే దాకా వెళ్లిపోయింది. సలీమా పాత్రకు ఎన్ని ఆడిషన్స్ చేసినా ఎవరు సెట్ కాకపోవడంతో ఆలస్యం జరగడం మొదలైంది. ఇలాగే అయితే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందనే భయంతో సలీమాగా తనే నటించడానికి రెడీ అయ్యారు ప్రవీణ. స్కైప్ ద్వారా వెంకటేష్ మహా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు.[3]

సంస్థలు

మార్చు

ప్రవీణ గారు "పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్"ని స్థాపించారు, తెలుగు సినీ దర్శకుడైన వెంకటేష్ మహా గారితో "మహాయాన మోషన్ పిక్చర్స్"కి ఈమె భాగస్వామ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.

మూలాలు

మార్చు
  1. సాక్షి (10 September 2018). "హీరో లేడు.. విలన్‌ లేడు." Archived from the original on 14 September 2018. Retrieved 14 September 2018.
  2. "Praveena Paruchuri's Story: How A Cardiologist From USA Produced C/o Kancharapalem".[permanent dead link]
  3. "From Being Cardiologist in US to Playing Prostitute".

బయటి(బాహ్య) లింకులు

మార్చు
  1. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పరుచూరి విజయ ప్రవీణ పేజీ