పర్దుమన్ సింగ్ బ్రార్

క్రీడాకారుడు

పర్దుమన్ సింగ్ బ్రార్ (1927 అక్టోబరు 15 – 2007 మార్చి 22) పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక క్రీడాకారుడు. ఇతడు షాట్‌పుట్, డిస్కస్ త్రో క్రీడాంశాలలో ఆసియా క్రీడల లలో మనదేశానికి పలు పతకాలు సాధించి పెట్టాడు[1].

పర్దుమన్ సింగ్ బ్రార్
వ్యక్తిగత సమాచారము
జాతీయతభారతీయుడు
జననం(1927-10-15)1927 అక్టోబరు 15
భగ్త భయ్, భతిండా జిల్లా
పంజాబ్ ప్రొవిన్స్, బ్రిటీష్ వారి ఆధీనంలోని భారతదేశం
మరణం2007 మార్చి 22(2007-03-22) (వయస్సు 79)
భగ్త భయ్, భతిండా , పంజాబ్, భారతదేశము
క్రీడ
దేశంభారతదేశము
క్రీడట్రాక్ అండ్ ఫీల్డ్
సంఘటన(లు)షాట్‌పుట్, డిస్కస్ త్రో
క్లబ్సర్వీసెస్

క్రీడా జీవితముసవరించు

1950 దశకంలో షాట్‌పుట్, డిస్కస్ త్రో పోటీలలో ఇతడు మనదేశంలో జాతీయ విజేత. షాట్‌పుట్ లో తన మొట్టమొదటి పతకాన్ని 1958లో మద్రాసులో జరిగిన జాతీయ షాట్‌పుట్ పోటీలలో సాధించాడు. 1954, 1958, 1959 సంవత్సరాలలో జాతీయ డిస్కస్ త్రో పోటీలలో విజేతగా నిలిచాడు. 1954 లో మనీలాలో జరిగిన ఆసియా క్రీడలలో షాట్‌పుట్, డిస్కస్ త్రో అంశాలు రెండిటిలో విజేతగా నిలిచి బంగారు పతకాలు సాధించాడు. ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి ఆసియా ఆటగాడిగా ఖ్యాతికెక్కాడు. తన ప్రదర్శనను కొనసాగిస్తూ 1958 లో టోక్యోలో జరిగిన ఆసియా క్రీడలలో షాట్‌పుట్ లో స్వర్ణపతకం, డిస్కస్ త్రోలో కాంస్య పతకం గెలుచుకున్నాడు.చివరిగా 1962 లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడలలో డిస్కస్ త్రోలో రజత పతకం గెలిచి వరుసగా జరిగిన మూడు ఆసియా క్రీడలలో తాను సాధించిన పతకాల సంఖ్యను 5 కు పెంచుకున్నాడు. ఇతని ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వము 1999లో ఇతడిని అర్జున అవార్డుతో సత్కరించింది.[2]

మరణముసవరించు

1980 లో జరిగిన ఒక ప్రమాదం ఫలితంగా బ్రార్ పక్షవాతం బారిన పడ్డాడు. ఈ వ్యాధితో బాధపడుతూ 2007 మార్చి 22న పంజాబ్ లోని తన స్వగ్రామంలో కన్నుమూశాడు[2]. మరణించే సమయానికి దుర్భర దారిద్ర్యంతో బాధపడుతూ చేతిలో చిల్లిగవ్వ లేకుండా చనిపోయాడు[3][4].

మూలాలుసవరించు

  1. "Parduman battles for life with little financial help coming". The Indian Express. 27 February 2007. Retrieved 15 August 2013. Italic or bold markup not allowed in: |publisher= (help)
  2. 2.0 2.1 "Parduman Singh dead". The Hindu. 23 March 2007. Archived from the original on 31 మార్చి 2007. Retrieved 15 August 2013. Italic or bold markup not allowed in: |publisher= (help)
  3. "Parduman's case raises many questions". tribuneindia. 22 May 1999. Retrieved 15 August 2013. Italic or bold markup not allowed in: |publisher= (help)
  4. "From the Editor". Business Today. 13 May 2012. Retrieved 15 August 2013. Italic or bold markup not allowed in: |publisher= (help)