పర్వతగిరి మండలం

తెలంగాణ, వరంగల్ జిల్లా లోని మండలం


పర్వతగిరి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం. 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభాజ్య వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [1] [2] పునర్వ్యవస్థీకరణలో కొత్తగా ఏర్పడిన వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజన్ పరిధిలో చేరింది.[3]ప్రస్తుతం ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

పర్వతగిరి
—  మండలం  —
తెలంగాణ పటంలో వరంగల్, పర్వతగిరి స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్, పర్వతగిరి స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్, పర్వతగిరి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°44′48″N 79°43′27″E / 17.746725°N 79.724236°E / 17.746725; 79.724236
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రం పర్వతగిరి
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,639
 - పురుషులు 23,965
 - స్త్రీలు 23,674
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.91%
 - పురుషులు 58.66%
 - స్త్రీలు 34.74%
పిన్‌కోడ్ 506369

మండల జనాభా

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 47,639, పురుషులు 23,965, స్త్రీలు 23,674. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 160 చ.కి.మీ. కాగా, జనాభా 47,639. జనాభాలో పురుషులు 23,965 కాగా, స్త్రీల సంఖ్య 23,674. మండలంలో 11,894 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. గోపనపల్లి
  2. కొంకపాక
  3. ఎనుగల్
  4. చింత నెక్కొండ
  5. చౌటపల్లి
  6. వడ్లకొండ
  7. రోళ్ళకల్
  8. సోమారం
  9. పర్వతగిరి
  10. కల్లెడ
  11. రావూర్
  12. అన్నారమ్ షరీఫ్
  13. బూరుగమదల
  14. జమల్‌పూర్

మూలాలు

మార్చు
  1. G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  2. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

మార్చు