పర్షోత్తమ్ రూపాలా

పర్షోత్తమ్ ఖోడాభాయ్ రూపాలా (జననం 1954 అక్టోబరు 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం కేంద్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతను గుజరాత్ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు.[1] [2]

పర్షోత్తమ్ రూపాలా
పర్షోత్తమ్ రూపాలా


ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డెయిరీ శాఖ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 జులై 7
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు గిరిరాజ్ సింగ్

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
2019 మే 31 – 2021 జులై 7

వ్యక్తిగత వివరాలు

జననం (1954-10-01) 1954 అక్టోబరు 1 (వయసు 69)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సవితబీన్ రూపలా (m. 1979)
సంతానం ఒక కుమార్తె ఒక కొడుకు

తొలినాళ్ళ జీవితం మార్చు

రూపాలా 1954 అక్టోబరు 1న హరిబెన్ ఖోడాభాయ్ మాదబాయి దంపతులకు జన్మించాడు. రూపలా సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సి గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎడ్ విద్యను పూర్తి చేసాడు. రాజకీయాల్లో చేరకుముందు 1977నుండి 1983 వరకు హరాంపూర్ లోని మాధ్యమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

1979లో రూపలా కి సవితాబేన్ తో వివాహమైంది, వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు.

మూలాలు మార్చు

  1. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Archived from the original on 14 February 2019. Retrieved 1 October 2015.
  2. "Cabinet Reshuffle: The full list of Modi's new ministers and what they got". The Economic Times. 8 July 2021. Retrieved 8 July 2021.