పల్నాటి పులి
}} పల్నాటి పులి 1984 నాటి యాక్షన్ సినిమా. తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో, సాయి చక్ర ప్రొడక్షన్స్ పతాకంపై గోగినేని ప్రసాద్ నిర్మించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, భానుప్రియ ముఖ్యపాత్రల్లో నటించగా చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1]
పల్నాటి పులి (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాతినేని ప్రసాద్ |
---|---|
నిర్మాణం | గోగినేని ప్రసాద్ |
కథ | భీశెట్టి లక్ష్మణరావు |
చిత్రానువాదం | తాతినేని ప్రసాద్ |
తారాగణం | నందమూరి బాలకృష్ణ, భానుప్రియ, కొంగర జగ్గయ్య |
నేపథ్య గానం | ఎస్.పి.బాలు, మాధవపెద్ది రమేష్, పి.సుశీల |
నృత్యాలు | శివశంకర్ |
ఛాయాగ్రహణం | నవకాంత్ |
కూర్పు | నాయని మహేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | సాయిచక్ర ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 1984 అక్టోబరు 28 |
భాష | తెలుగు |
పాత్రధారులు
మార్చు- రాజుగా నందమూరి బాలకృష్ణ
- రాణిగా భానుప్రియ
- భూపతిగా సత్యనారాయణ
- న్యాయవాది ముకుందం పాత్రలో జగ్గయ్య
- కన్నయ్యగా గోకిన రామారావు
- కోదండంగా మాడా
- గంగులుగా భీమరాజు
- ఐటెమ్ పాటలో జయమాలిని
- గౌరీగా శ్యామల గౌరీ
- పార్వతిగా ప్రమీల
- శారదగా అనిత
- సరోజగా బిందు మాధవి
సాంకేతిక సిబ్బంది
మార్చు- కళ: బి.ఎన్.కృష్ణ, ఎస్.హనుమంతరావు
- నృత్యాలు: శివ శంకర్
- స్టిల్స్: విజయ్ కుమార్
- పోరాటాలు: రాజు, పరశురాం
- సంభాషణలు: పరుచూరి సోదరులు
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి.సుశీల, మాధవపెద్ది రమేష్
- సంగీతం: చక్రవర్తి
- కథ: భీశెట్టి లక్షణరావు
- కూర్పు: నాయని మహేశ్వరరావు
- ఛాయాగ్రహణం: నవకాంత్
- నిర్మాత: గోగినేని ప్రసాద్[2]
- స్క్రీన్ప్లే - దర్శకుడు: తాతినేని ప్రసాద్
- బ్యానర్: సాయి చక్ర ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 1984 అక్టోబరు 28
పాటలు
మార్చువేటూరి సుందరరామ మూర్తి రాసిన పాటలకు చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. AVM ఆడియో కంపెనీ ఈ పాటలను విడుదల చేసింది.
ఎస్. | పాట | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | "ఓసి ఒత్తరి బిత్తరి" | ఎస్పీ బాలు, | 3:59 |
2 | "కొట్టమాక తిట్టమాక" | మాధవపెద్ది రమేష్, పి. సుశీల | 4:14 |
3 | "అబ్బా సామి రంగా" | పి. సుశీల | 4:15 |
4 | "నీకు పెట్టనివ్వూ" | మాధవపెద్ది రమేష్, పి. సుశీల | 4:22 |
5 | "బాకా బాజా డోలు" | ఎస్పీ బాలు | 4:19 |
మూలాలు
మార్చు- ↑ "Palnati Puli (Review)". Nth Wall. Archived from the original on 2015-01-24. Retrieved 2020-08-06.
- ↑ Andhrajyothy (13 September 2023). "టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి". Archived from the original on 14 సెప్టెంబరు 2023. Retrieved 14 September 2023.