పరుచూరి సోదరులు

తెలుగు సినిమాల కోసం సంభాషణలు వ్రాస్తున్న జంట రచయితలు పరుచూరి సోదరులు. వీరు పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ. వీరిద్దరు సోదరులు. వీరిలో పరుచూరి వెంకటేశ్వరరావు పెద్దవారు. అన్నదమ్ములిద్దరు 333 పైగా చిత్రాలకు డైలాగులు వ్రాసి, సంభాషణల రచయితలుగా ప్రసిద్ధి చెందారు.వీరు కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఇద్దరూ కలసి,విడివిడిగా కొన్ని సినిమాలలో నటించారు.వెంకటేశ్వరరావు ఎక్కువుగా సెంటిమెంటు ప్రాధాన్యత ఉన్న పాత్రల సినిమాలలో నటించాడు.అన్నదమ్ములు కలసి రచనలు చేస్తూ ఉండటం ఒక విశేషం.[1]ఆలీతో సరదాగా అన్న కార్యక్రమంలో ఈ అన్నదమ్ములు ఇద్దరూ పాల్గొన్నారు. వీరి గురించిన వివరాలు వారిద్దరు చాలా ఆ కార్యక్రమంలో చెప్పారు.[1]

సంభాషణల సినీ జాబితా సవరించు

  1. ఖైదీ నెంబర్ 150 (2017)
  2. ఆలస్యం అమృతం (2010)
  3. అనసూయ (2007)
  4. ఆట (2007)
  5. అస్త్రం (2006)
  6. అల్లరి పిడుగు(2005)
  7. సంక్రాంతి (2005)
  8. నేనున్నాను (2004)
  9. లక్ష్మీనరసింహా (2004)
  10. శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.(2004)
  11. పల్నాటి బ్రహ్మ నాయుడు (2003)
  12. నీ స్నేహం (2002)
  13. సీమ సింహం (2002)
  14. రా (2001)
  15. మనసంతా నువ్వే (2001)
  16. చిట్టెమ్మ మొగుడు (1992)
  17. ఆయుధం (1990)
  18. ఆడది (1990)[2]
  19. అనసూయమ్మ గారి అల్లుడు (1986)
  20. చట్టానికి వేయికళ్లు (1983)

కథల సినీ జాబితా సవరించు

  1. వర్షం (2008)
  2. సైనికుడు (2006)
  3. మాస్ (2004)
  4. ఠాగూర్ (2003)
  5. శాంభవి ఐపిఎస్ (2003)
  6. నాగ (2003)
  7. నీకు నేను నాకు నువ్వు (2003)
  8. అల్లరి రాముడు (2002)
  9. నరసింహ నాయుడు (2001)
  10. మనసంతా నువ్వే (2001)
  11. ఆడది (1990)

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (21 June 2015). "పరుచూరి వెంకటేశ్వరరావు బర్త్ డే". Retrieved 3 March 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
  2. Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]

వెలుపలి లంకెలు సవరించు

[1]. ఆలీతో సరదాగా - పరుచూరి బ్రదర్స్