ప్రధాన మెనూను తెరువు

జయమాలిని (జ. 1958 జూన్ 15) సుప్రసిద్ద దక్షిణాది సినిమా నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 600 చిత్రాలలో నటించింది. శృంగార నృత్య తారగా ప్రసిద్ధి చెందినది. ఈమె సోదరి జ్యోతిలక్ష్మి కూడా సుప్రసిద్ద సినీ నర్తకి.[1]. ఈమె 1970 నుండి 1990 దశకం వరకూ అనేక విజయవంతమైన చిత్రాలలో శృంగార నృత్యాలను చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

జయమాలిని
Jayamalini Actress.jpg
ఒక ప్రత్యేక గీతంలో నర్తిస్తున్న జయమాలిని
జన్మ నామంఅలివేలు మంగ
జననం (1958-12-22) 1958 డిసెంబరు 22 (వయస్సు: 60  సంవత్సరాలు)
చెన్నై
క్రియాశీలక సంవత్సరాలు 1970 - 1995
ప్రముఖ పాత్రలు జగన్మోహిని

నేపథ్యముసవరించు

ఈమె అసలు పేరు అలమేలు మంగ. ఈమె అమ్మ వెంకటేశ్వరస్వామి భక్తురాలు. అందుకే అలమేలుమంగ అన్న పేరు పెట్టింది. అయితే ఆ పేరు చాలా మొరటుగా ఉందన్న ఉద్దేశంతో దర్శకుడు విఠలాచార్య ఈమెకు ‘జయమాలిని’ అని నామకరణం చేశారు.

సినీ రంగ ప్రవేశముసవరించు

ఈవిడ మేనత్త టి.ఆర్.రాజకుమారి 1940వ దశకంలో తమిళంలో అగ్రనటి. ఆమె ‘చంద్రలేఖ’, ‘హరిదాసు’ వంటి సినిమాల్లో నటించారు. ఈవిడ మావయ్య టీ ఆర్‌ రామన్న ప్రముఖ దర్శకుడు. ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు. లత, రవిచంద్రన్‌ హీరో హీరోయిన్లుగా ‘స్వర్గత్తిల్‌ తిరుమనం’ పేరుతో తమిళ సినిమా తీస్తుండగా ఓ రోజు టీఏ రామన్‌ ఈవిడ తల్లి వద్దకు వచ్చారు. అందులో హీరోయిన్‌ స్నేహితురాలిగా ఓ పాత్ర వుందని, జయమాలినిని అందులో నటింపజేస్తానని వీళ్ళ అమ్మని అడిగారు. అప్పటికి జయమాలిని వయసు పన్నెండేళ్లు. అదే ఈవిడ తొలిచిత్రం. ఆ సినిమా రిలీజైన తరువాత విఠలాచార్య ఈమె ఫోటోలను చూసి తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడదాని అదృష్టం’ సినిమాలో ఐటమ్‌సాంగ్‌ చేయాలని వీళ్ళ అమ్మని అడిగాడు. అప్పటిలో జయమాలిని చాలాపీలగా వుండడంతో పాటలో నటించేందుకు వీళ్ళ అమ్మ కొంత సందేహించింది. తర్జనభర్జనల తరువాత అమ్మ ఒకే చెప్పింది. అదే జయమాలిని నటించిన తొలి తెలుగు సినిమా.

ఈవిడ భరతనాట్యం నేర్చుకున్నది. అప్పటికే ఈమె సోదరి జ్యోతిలక్ష్మి ఐటమ్‌సాంగ్స్‌లో నటిస్తోంది. ఆమెకు డ్యాన్స్‌ నేర్పేందుకు ఇంటికొచ్చిన గురువుల వద్దే జయమాలిని కూడా డ్యాన్స్‌ నేర్చుకున్నది. అప్పుడు చాలా చలాకీగా వుండేది. ఆ సమయంలో వీరి ఇంటికొచ్చిన సీనియర్‌ దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ ఈవిడను చూసి 'ఈ అమ్మాయిని పెట్టి కూడా నేను సినిమా తీస్తా' అన్నారు. అన్నట్లుగానే ఆ తరువాత ఆయన సినిమాల్లో అవకాశాలు కల్పించారు. అలా ఈవిడ చలాకీతనం, అందం, నృత్యం.. ఇవన్నీ గమనించే విఠలాచార్య ఈవిడకు అవకాశం కల్పించారు.

వ్యక్తిగత జీవితముసవరించు

సినిమాల నుండి విరమించిన తర్వాత కుటుంబ మిత్రుడైన ఒక పోలీసు ఇన్స్పెక్టరు పార్తీబన్ ను పెళ్ళి చేసుకుని చెన్నై లో స్థిరపడింది.[2].యుక్త వయసులో ఉన్న ఈమె కూతురు నాట్యం చేర్చుకుంటున్నా, తను మాత్రం కూతుర్ని సినీరంగంలో అడుగు పెట్టనివ్వనని నిర్ణయం తీసుకున్నది.[3] 2005లో జయమాలిని తన జీవితచరిత్రను వ్రాయటంలో సహాయం చేయటానికి ఒక రచయిత కోసం వెతికింది.[4]

జయమాలిని నర్తించగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కొన్ని శృంగార గీతాలుసవరించు

జయమాలిని నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితాసవరించు

తెలుగుసవరించు

తమిళముసవరించు

కన్నడసవరించు

మలయాళముసవరించు

హిందీసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=జయమాలిని&oldid=2487838" నుండి వెలికితీశారు