పల్నాడు (2013 సినిమా)

పల్నాడు 2013లో విడుదలైన తెలుగు సినిమా.[1] విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించిన ఈ సినిమాకు సుశీంద్రన్ దర్శకత్వం వహించాడు. విశాల్, లక్ష్మీ మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తమిళంలో ‘పాండ్యనాడు’ పేరుతో, తెలుగులో పల్నాడు పేరుతో 02 నవంబర్ 2013న విడుదలైంది.[2]

పల్నాడు
దర్శకత్వంసుశీంద్రన్
రచనసుశీంద్రన్
నిర్మాతవిశాల్
తారాగణంవిశాల్‌, లక్ష్మీ మీనన్‌, భారతీరాజా, సూరి, సోమసుందరం
ఛాయాగ్రహణంమాధి
కూర్పుఆంటోనీ
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థ
విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
విడుదల తేదీ
2 నవంబర్ 2013
దేశం భారతదేశం
భాషతెలుగు

శివకుమార్‌ (విశాల్‌) బాగా భ‌య‌స్తుడు, ఓ సెల్ షాప్ న‌డుపుకొంటూ ఉంటాడు. తమ ఇంటిపైనే అద్దెకుండే మాలతిని (లక్ష్మి మీనన్‌) ప్రేమిస్తాడు. ఆ ఊరికి పెద్ద దాదా అయిన కాటమ రవి తన మైనింగ్‌ వ్యాపారానికి అడ్డు తగిలాడని, శివకుమార్‌ అన్నయ్యని చంపేస్తాడు. దాంతో శివకుమార్‌, అతని తండ్రి (భారతీరాజా) విడివిడిగా రవిపై పగ తీర్చుకోవాలని పథకం వేసుకుంటారు. పిరికివాడైన శివ‌కుమార్‌ త‌న అన్నయ్యను చంపిన‌వాడిని ఎలా ఎదుర్కొన్నాడు ? ఈ విష‌యంలో ఎలా విజయం సాధించాడు ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ
  • నిర్మాత: విశాల్‌
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: సుసీంద్రన్‌
  • సంగీతం: ఇమాన్‌
  • సినిమాటోగ్రఫీ: మాధి
  • ఎడిటర్: ఆంటోనీ

మూలాలు

మార్చు
  1. Sakshi (25 October 2013). "'పందెంకోడి'లా 'పల్నాడు' పేరు తెస్తుంది - దాసరి". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  2. Sakshi (31 October 2013). "వందకోట్లు ఇస్తామన్నా... మళ్లీ అలాంటి ప్రయోగం చేయను!". Archived from the original on 19 September 2021. Retrieved 19 September 2021.
  3. The Times of India (15 January 2017). "Vishal's Palnadu to release for Diwali - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.