పల్లె రఘునాథరెడ్డి

(పల్లె రఘునాథ్‌రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

పల్లె రఘునాథ్‌రెడ్డి 2014 సార్వత్రిక ఎన్నికలలో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించారు. 1999లో అప్పటి నల్లమాడ నియోజక వర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి ప్రభుత్వంలో విప్‌గానూ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ఆ తరువాత జిల్లా నుంచి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009, 2014లో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు గెలుపొందారు. ఈయన వయస్సు 60 సంవత్సరాలు. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పల్లె వాండ్లపల్లి వీరి స్వగ్రామం. ఎమ్మెస్సీ, ఎం.ఫిల్, పీహెచ్‌డీ చేసి అధ్యాపకుడిగా పనిచేశారు. జిల్లాలో శ్రీ బాలాజీ విద్యాసంస్థలను నెలకొల్పారు.


మూలాలు మార్చు

సాక్షి దినపత్రిక - 9-6-2014