పుట్టపర్తి

ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండల పట్టణం

పుట్టపర్తి ఆంధ్ర ప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా పట్టణం, జిల్లా కేంద్రం. ఈ పట్టణానికి ఆకర్షణ సత్య సాయిబాబా ప్రశాంతి నిలయం ఆశ్రమం. ఇది సమీప పట్టణమైన ధర్మవరం నుండి 42 కి. మీ. దూరంలో ఉంది.

పుట్టపర్తి
పట్టణం
ప్రశాంతి నిలయం పరిసరాలు
ప్రశాంతి నిలయం పరిసరాలు
పుట్టపర్తి is located in Andhra Pradesh
పుట్టపర్తి
పుట్టపర్తి
నిర్దేశాంకాలు: 14°09′58″N 77°48′40″E / 14.166°N 77.811°E / 14.166; 77.811Coordinates: 14°09′58″N 77°48′40″E / 14.166°N 77.811°E / 14.166; 77.811
దేశంఇండియా
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంపురపాలక సంఘం
విస్తీర్ణం
 • మొత్తం45.47 km2 (17.56 sq mi)
విస్తీర్ణపు ర్యాంకు89వ (A.P.)
సముద్రమట్టం నుండి ఎత్తు
475 మీ (1,558 అ.)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం68,000
 • సాంద్రత1,500/km2 (3,900/sq mi)
భాషలు
 • అధికారతెలుగు
కాలమానంUTC+05:30 (ఐ.ఎస్.టి)
పిన్‌కోడ్
515133, 515134
ఎస్.టి.డి.కోడ్91-8555
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుAP–02

చరిత్రసవరించు

పుట్టపర్తికి తొలుత ఉన్న పేరు గొల్లపాళ్యం. ఆ తరువాత దానికి వాల్మీకిపురం అనే పేరు కూడా వచ్చింది.

భౌగోళికంసవరించు

ఈ పట్టణం అక్షాంశ రేఖాంశాలు 14.166N, 77.811E.

 
పుట్టపర్తి ప్రాంతం (OSM గతిశీల పటం)

జనగణన వివరాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఇది 4368 ఇళ్లతో, 15088 జనాభాతో 4547 హెక్టార్లలో విస్తరించి ఉంది.[2]

పరిపాలనసవరించు

పుట్టపర్తి నగర పంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యా సౌకర్యాలుసవరించు

సమీప ఇంజనీరింగ్ కళాశాల అనంతపురంలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల అనంతపురంలోను, పాలీటెక్నిక్ ధర్మవరంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హిందూపురంలో ఉన్నాయి.

వైద్య సౌకర్యాలుసవరించు

ఇక్కడ 220 పడకలు గల ఒక అత్యాధునిక ఆసుపత్రి వుంది. దీనిపేరు. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్

రహదారి సౌకర్యంసవరించు

ఇది అనంతపురమునకు 84 కి.మీ., హిందూపురమునకు 65 కి.మీ., బెంగుళూరుకు 156 కి.మీ., హైదరాబాదుకు 472 కి.మీ. దూరములో ఉంది. సమీప జాతీయ రహదారి NH 44, కోడూరు.

రైలు సౌకర్యంసవరించు

ఇక్కడి రైలు నిలయం పేరు "శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం". దీనిని 2000 నవంబరు 23న ప్రారంభించారు. ఇది ఆశ్రమమునకు దాదాపుగా 8 కి.మీ. (5 మైళ్ళు) దూరములో ఉంది. దగ్గరిలోని రైలు కూడలి 45 కి.మీ. (28 మైళ్ళు) దూరములో ఉన్న ధర్మవరం.

విమాన సౌకర్యంసవరించు

ఇక్కడ శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు నిర్వహణలో శ్రీ సత్యసాయి విమానాశ్రయం ఉంది. గతంలో సాధారణ విమానాల రాకపోకలు జరిగినా, ప్రస్తుతం ఒప్పందపు విమాన ప్రయాణాలకొరకు మాత్రమే వినియోగంలో వుంది. ఈ విమానాశ్రయం ఆశ్రమానికి 4 కి.మీ. (2.5 మైళ్ళు) దూరములో ఉంది. దగ్గరిలోని అంతర్జాతీయ విమానాశ్రయం 110 కి.మీ. (68 మైళ్ళు) దూరములో గల కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం.

భూమి వినియోగంసవరించు

పుట్టపర్తి రెవిన్యూ గ్రామ పరిధిలో 2011 జనగణన వివరాల ప్రకారం, భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • అడవి: 94 హెక్టార్లు
 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 64 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2015 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 9 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 31 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 14 హెక్టార్లు
 • బంజరు భూమి: 650 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1665 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 2225 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 105 హెక్టార్లు ( బావులు/బోరు బావులు)

క్రీడా సౌకర్యాలుసవరించు

2006 లో స్థాపించబడిన శ్రీ సత్యసాయి అంతర్జాతీయ క్రీడా కేంద్రం (Sri Sathya Sai International Centre for Sports) లో వివిధ రకాల భవనంలోపల ఆడగలిగే ఆటల సౌకర్యాలున్నాయి. 1985 లో నిర్మింపబడిన శ్రీసత్యసాయి హిల్ వ్యూ స్టేడియం (Sri Sathya Sai Hill View Stadium) 50,000 మంది ప్రేక్షకుల సామర్ధ్యం కలిగివుంది. దీనిని ప్రధానంగా క్రికెట్ ఆటకు వాడతారు..[3]

ఉత్పత్తిసవరించు

వేరుశనగ, వరి, పొద్దుతిరుగుడు

చిత్రమాలికసవరించు

ప్రముఖులుసవరించు

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
 2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 3. "Sri Sathya Sai Central Trust, Prasanthi Nilayam". www.srisathyasai.org.in. Archived from the original on 2019-11-01. Retrieved 2022-06-08.

వెలుపలి లంకెలుసవరించు