పళ్ళిపట్టు పట్టణం కుశస్థలీ నది ఒడ్డున యున్నది. తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లాకు చెందిన ఈ చిన్న పట్టణం ఆంధ్ర రాష్ట్రాన్ని సరిహద్దున ఉంది. 2001వ సంవత్సరం భారతదేశ జనాభా లెక్కల ప్రకారం సుమారు 8,650 మందికి పైగా జనాభా కలగి యున్నది. ఇందులో సుమారు 50 శాతం మంది ప్రజలు తెలుగు భాషను మాతృభాషగా కలగి యున్నారు,40%శాతం మంది తమిళభాషను మిగిలిన వారలు ఉర్దు, హిందీ, కన్నడ మొదలగు భాషలను తమ మాతృభాషగా కలగి యున్నారు .[1]

పళ్ళిపట్టు
పల్లిపాట్
పట్టణం
దేశముభారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాతిరువళ్ళూరు
Elevation
154 మీ (505 అ.)
భాష
 • అధికారకతమిళ భాష
Time zoneUTC+5:30 (IST)
పిన్
631207
టెలఫొన్ కోడు(91)44 - 2784

రవాణా సౌకర్యము సవరించు

పళ్ళిపట్టు పట్టణం పళ్లిపట్టు తాలూకా యొక్క రాజధాని, ఈ పట్టణంమ ముఖ్య రహధారుల కూడలిలో ఉన్నది, కావున పుత్తూరు-చిత్తూరు, చిత్తూరు-నగరి నడుమ నడిచే బస్సులు తరచూ వస్తుంటాయి, చెన్నై, తిరుత్తని, తిరుపతి, బెంగుళూరు, షొలింఘర్ వంటి ప్రాంతాలకు రవాణా వసతి గలదు. పళ్ళిపట్టు నగరానికి పరిసర ప్రాంతాల నుండి అనేక మంది ప్రజలు వస్తువులను కొనుగోలు చెయుటకై రోజూ వస్తుంటారు, వీరిలో అంధ్ర రాష్ట్రాన్నికి చెందిన వారూ ఉంటారు, ముఖ్యంగా దీపావళి టపాకాయల కొనుగోలుకై ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా నుండి చాలా మంది వస్తుంటారు.

2009 దుర్ఘటన సవరించు

గత 2009వ సంవత్సరం అక్టోబరు నెల 17వ తేది, శుక్రవరము సాయంత్రము యొక్క టపాకాయ దుకాణములో జరిగిన అగ్ని ప్రమాదము బారిన పడి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, వీరిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే.[2][3]. ఈ ఘటనతో పళ్ళిపట్టు పట్టణం వార్తలోకి ఎక్కింది.అప్పటి నుండి టపాకాయల వ్యపారము చాలా తగ్గింది.

వివరాల పట్టిక సవరించు

దేశం ఇండియా
రాష్ట్రం తమిళనాడు
అధికార భాష తమిళ భాష
జనాభా 8,650 (2001లో)
పిన్‌కోడు 631207
జనాభాలో పురుషుల సంఖ్య 4,314
జనాభాలో స్త్రీల సంఖ్య 4,336
అక్షరాస్యతుల సంఖ్య 6,142
వాహన ఆమోద సంఖ్య TN-20

విద్యా సంస్థల పేర్లు సవరించు

పళ్ళిపట్టులో అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్ధలకు చెందిన పాఠశాలలు ఉన్నాయి, చుట్టు ప్రక్కల గ్రామాల నుండి విద్యార్థులు చదువుకోవడానికి వస్తూవుంటారు.తమిళ, తెలుగు, ఇంగ్లీషు భాషలలో పాఠాలు బోధింపబడుతుంది.

  • బాలుర ప్రభుత్వ మహోన్నత పాఠశాల[4]
  • బాలికల ప్రభుత్వ మహోన్నత పాఠశాల
  • సాయిశ్రీ మెట్రికులేషన్ పాఠశాల
  • సెయింట్ మేరీస్ మెట్రికులేషన్ పాఠశాల
  • పంచాయితి యునియన్ పాఠశాల (మెయిన్)
  • పంచాయితి యునియన్ పాఠశాల (ధలవాయి పటెడ)

సూచికలు సవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2004-06-16. Retrieved 2004-06-16.
  2. [హిందు దిన పత్రిక:http://www.hindu.com/2009/10/17/stories/2009101757931400.htm Archived 2012-03-23 at the Wayback Machine]
  3. [చిత్రమాలా వెబ్ సైట్ : http://www.chitramala.in/news/pallipattu-tragedy-leaves-a-deep-scar-on-ap-families-115856.html[permanent dead link]]
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2013-08-05.

యితర లింకులు సవరించు