పశుపతి కుమార్ పారస్

పశుపతి కుమార్ పారస్ (జననం 1953) బీహార్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. 2021 జులై 7 నుండి కేంద్ర మంత్రివర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు. ప్రస్తుతం హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం) నుంచి లోక్‌సభ సభ్యుడిగా పనిచేస్తున్నాడు.[1][2]

బీహార్ ప్రభుత్వంలో జంతు, మత్స్య వనరుల శాఖ మంత్రి పదవిని కూడా ఈయన నిర్వహించాడు. ఇతను దివంగత రాజకీయవేత్త రామ్ విలాస్ పాస్వాన్ తమ్ముడు, లోక్ జన్శక్తి పార్టీ బీహార్ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. జూన్ 2021 లో చిరాగ్ కుమార్ పాస్వాన్ స్థానంలో లోక్ జన్శక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1977 నుండి అలౌలి నియోజకవర్గం నుండి వరుసగా ఏడుసార్లు బీహార్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు బీహార్ రాష్ట్రంలో మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.

కేబినెట్ సమగ్రత జరిగినప్పుడు రెండవ మోడీ మంత్రిత్వ శాఖలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రి అయ్యాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. Won’t agree on less than 7 Lok Sabha seats: Paras
  2. Most JDU faces retained in 28-member Nitish Cabinet: BJP gets 11, LJP one
  3. "Modi cabinet rejig: Full list of new ministers". India Today. Retrieved 2021-07-07.
  4. Eenadu (20 March 2024). "పశుపతి పరాస్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. కిరణ్‌ రిజిజుకు అదనపు బాధ్యతలు". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.